జపాన్‌లో రూలింగ్‌కి రెడీ అయిన "పుష్ప".. రిలీజ్ డేట్ ఫిక్స్ !!
పుష్ప.. పుష్పరాజ్ అంటూ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు స్టార్ హీరో అల్లుఅర్జున్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఒక్క బాలీవుడ్ లోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత పార్ట్ 2.. విడుదలైన రోజు నుంచే పుష్ప రాజ్ బాక్సాఫీస్ వద్ద తన హవాని చూపించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.
కాగా బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాలకు గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ నెలకొంది. మరి ముఖ్యంగా జపాన్ లో మన చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'ముత్తు' సినిమాతో జపాన్ లో కూడా భారీ హిట్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ సైతం మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్ 'దేవర' సినిమా సైతం రిలీజ్ అవ్వగా.. ప్రమోషన్లలో కూడా ఆయన పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రం కూడా జపాన్ లో విడుదలకు సిద్దమైంది.

లేటెస్ట్ గా ఈ సినిమా జపాన్ రిలీజ్ తేదీని నిర్మాతలు తాజాగా అధికారికంగా ప్రకటించారు. 2026 జనవరి 16న జపాన్‌లో ఈ మూవీని విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. 'పుష్ప కున్రిన్' పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత బాక్సాఫీస్‌ను షేక్ చేసి అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ మూవీ జపాన్‌లోనూ సంచలనం సృష్టించడం ఖాయమంటూ మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు హీరోయిన్ రష్మిక చేసిన పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో .. నమస్కారం జపాన్.. వైల్డ్ ఫైర్ అధికారికంగా గ్లోబల్ వైడ్ గా వ్యాపిస్తోంది. పుష్ప జపాన్‌లో ల్యాండ్ అవుతున్నాడు.. మీరు సిద్ధంగా ఉన్నారా??" అని రాసుకొచ్చింది. అంతే కాకుండా తెలుగు, జపనీస్ డైలాగ్స్‌తో కూడిన 'పుష్ప కున్రిన్' ట్రైలర్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఫుల్ ట్రెండింగ్ గా మారింది. అల్లు అర్జున్, సుకుమార్ స్వయంగా జపాన్‌లో సినిమాను ప్రమోట్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు పుష్ప 3 కూడా ఉన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ పుష్ప-3 2028లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ సినిమా ఈవెంట్ లో ప్రకటించారు.
Konnichiwa, Japan!! 🇯🇵💛
— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025
Aaaand the wildfire is officially going global..
Pushpa lands in Japan on 16th Jan 2026.. are you ready?? 😄🔥
Watch the full Japanese trailer here: https://t.co/pEije6R5IA#Pushpa2inJapan #Pushpa2TheRule #PushpaKunrin #WildFirePushpa #プシュパ君臨… pic.twitter.com/PUikDZFpv9












Click it and Unblock the Notifications