ఈ ఏడాది ఓటీటీని షేక్ చేసిన వెబ్ సిరీస్ ఇదే.. హయ్యెస్ట్ వ్యూస్‌తో రచ్చ రచ్చ
2025 ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది వెండితెరపై కంటే ఓటీటీ తెరపైనే సంచలనాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఒకవైపు కొత్త సినిమాలు, మరోవైపు ఒళ్లు గగుర్పొడిచే వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు హోరెత్తాయి. అయితే, 2025లో వచ్చిన సిరీస్‌లన్నింటిలోకీ 'బ్లాక్ వారెంట్' ఒక ప్రత్యేక ముద్ర వేసింది. కేవలం 7 ఎపిసోడ్లతో, చూసే ప్రతి నిమిషం గుండెను పిండేసే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.
కొన్ని కథలు వింటే గుండె బరువెక్కుతుంది. మరికొన్ని నిజాలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. 1982లో దేశ రాజధాని ఢిల్లీని గడగడలాడించిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సిరీస్ 'బ్లాక్ వారెంట్'. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ సిరీస్, 2025 ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ సిరీస్‌గా నిలిచి తన సత్తా చాటింది.

దేశం చిందించిన కన్నీరు..
ఈ కథ 1978లో మొదలవుతుంది. కుల్జీత్ సింగ్, జస్బీర్ సింగ్ అనే అన్నదమ్ములు చేసిన ఒక పాశవిక చర్య దేశాన్ని కుదిపేసింది. ఒక నేవీ అధికారి సంతానమైన గీతా చోప్రా, సంజయ్ చోప్రాలను అపహరించి, అడవిలోకి తీసుకెళ్లి గీతపై అత్యాచారం చేసి, ఆపై ఇద్దరినీ అత్యంత క్రూరంగా హతమార్చారు. రెండు రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైన ఆ చిన్నారుల మృతదేహాలు చూసి భారతావని కన్నీరుమున్నీరైంది.
ఉరి తీసినా వీడని ప్రాణం..
నిందితులను పోలీసులు పట్టుకున్నాక, కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 1982 జనవరి 31న ఢిల్లీలోని తిహార్ జైలులో ఆ అన్నదమ్ములను ఉరి తీశారు. అయితే, అక్కడే ఒక విస్మయకర సంఘటన జరిగింది. ఉరి తీయగానే కుల్జీత్ సింగ్ చనిపోయాడు. కానీ, జస్బీర్ సింగ్ మాత్రం ఉరితాడుకు వేలాడుతూనే రెండు గంటల పాటు ప్రాణాలతో కొట్టుకులాడాడు.
బాడీ వెయిట్ లెక్కల్లో జరిగిన పొరపాటు వల్ల అతడి గొంతు ఎముక వెంటనే తెగలేదు. ఆ రెండు గంటల పాటు జైలు అధికారులు అనుభవించిన ఆందోళన, ఆ నిందితుడి వేదన వర్ణనాతీతం. తిహార్ జైలు మాజీ అధికారి సునీల్ గుప్తా రాసిన 'బ్లాక్ వారెంట్' పుస్తకంలోని ఈ నిజాలు చదువుతుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.
-
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
కొడుక్కి న్యాయం చేసిన షారూఖ్.. కుతుర్ని గట్టెక్కిస్తారా ?? -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
మోసాలిసా పెళ్లి!.. హైటెన్షన్ నడుమ పోలీసులు ఫుల్ ప్రొటెక్షన్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే?












Click it and Unblock the Notifications