విజయ్ కి అనూహ్య మద్దతు: ఏకంగా ముఖ్యమంత్రే.. !!

దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' విడుదల విషయంలో సంచలన తీర్పు వెలువడింది. సెన్సార్ సర్టిఫికేషన్ కేసు వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)) ఈ చిత్రానికి 'యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీతో సినిమా విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో సినిమా విడుదలపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్న కారణంగా ఈ చిత్రం విడుదలపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత, ఆందోళన నెలకొంది.

సీబీఎఫ్‌సీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా క్లియరెన్స్ ఆలస్యమైంది. సినిమా నిర్మాతలు, సీబీఎఫ్‌సీ మధ్య జరిగిన న్యాయ పోరాటం నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు నుంచి తాజా తీర్పు వచ్చింది. యూ/ఏ సర్టిఫికెట్ తో సినిమా విడుదలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీటీ ఆశా బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'జన నాయగన్'.. వాస్తవానికి ఈ నెల 9న పొంగల్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. సీబీఎఫ్‌సీ ధృవీకరణలో జాప్యం కారణంగా నిర్మాతలు విడుదల తేదీని వాయిదా వేశారు.

CM Stalin Fires Up the Censorship Debate Amid BJP Spotlight on Jana Nayagan

ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. సెన్సార్ బోర్డును సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలతో పోల్చారు. సీబీఐ, ఈడీ, ఐటీ తరహాలోనే సెన్సార్ బోర్డు కూడా బీజేపీ ప్రభుత్వానికి కొత్త ఆయుధంగా మారిందని విమర్శించారు. సీబీఎఫ్సీ చర్యలను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు- కేంద్రంతో తమిళనాడుకు ఉన్న ఘర్షణ పూరక వాతావరణాన్ని, విజయ్ సినిమాతో పాటు కోలీవుడ్ కు ఆయన పరోక్ష మద్దతుగా నిలిచినట్టయింది.

హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. విజయ్ కేరీర్ లో చివరి మజిలీగా చెబుతున్నారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఆయన అడుగు పెట్టనున్నారు. ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోన్నారు. ఈ పరిస్థితుల్లో జన నాయకన్ సినిమా విడుదల ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో వయోలెన్స్ మితిమీరడం, సమకాలీన రాజకీయాల వంటి అంశాలపై ఆందోళనల కారణంగా సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రావడంతో జాప్యం చోటు చేసుకుంది.

డిసెంబర్ 22న ప్రాథమిక మార్పుల తర్వాత సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ లభిస్తుందని నిర్మాతలకు సమాచారం అందింది. తుది ధృవీకరణకు ముందు ఈ అంశాలను నిపుణుల కమిటీకి పంపారు. సీబీఎఫ్‌సీ ఆమోదం ఆలస్యం కేవలం తమిళ వెర్షన్‌నే కాకుండా, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్లను కూడా ప్రభావితం చేసింది. ఈ ఇతర భాషా వెర్షన్లు ధృవీకరించాలంటే మాతృ భాష వెర్షన్‌కు అనుమతి తప్పనిసరి. దీంతో విడుదల నిలిచిపోయింది. ఇప్పుడు దీనికి లైన్ క్లియర్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+