లండన్‌లో "షారుఖ్ - కాజోల్" కల్ట్ క్లాసిక్ మూవీకి స్పెషల్ రికార్డ్..!
బాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో "దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే" ఒకటి. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ చిత్రం 1995 అక్టోబర్ 20న విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించగా.. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ప్రేమకు నిర్వచనంగా నిలిచిన ఈ మూవీకి ఆడియన్స్ నీరాజనాలు పలికారు. హిందీ సినిమా చరిత్రలో అత్యధిక కాలం నడిచిన మూవీగా 'DDLJ' రికార్డు సృష్టించింది. ముంబైలోని మరాఠా మందిర్‌లో దాదాపు 27 ఏళ్ల పాటు (మధ్యలో గ్యాప్ ఇస్తూ) ప్రదర్శించారు. కాగా ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తి చేసుకోగా.. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.
ఈ కల్ట్ క్లాసిక్ చిత్రంలోని ఐకానిక్ పాత్రలైన రాజ్- సిమ్రాన్ పాత్రల కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేశారు. కాగా "మెహందీ లగా కే రఖ్నా" పాటలోని ఐకానిక్ డ్యాన్స్ పోజ్‌లో దీన్ని రూపొందించారు. షారూఖ్ ఖాన్, కాజోల్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు కాజోల్ తన కుమార్తె నైసా, కుమారుడు యుగ్‌తో కలిసి హాజరయ్యారు. షారుఖ్ ఖాన్ ఈ అరుదైన గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ "బడే బడే దేశో మే ఐసీ చోటీ చోటీ బాతే హోతి రహతీ హై, సెనోరిటా!" అనే తన ఐకానిక్ డైలాగ్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

'సీన్స్ ఇన్ ది స్క్వేర్'లో తొలి భారతీయ చిత్రం..
"సీన్స్ ఇన్ ది స్క్వేర్" జాబితాలో విగ్రహంతో సత్కరించబడిన మొదటి భారతీయ చిత్రంగా DDLJ నిలిచింది. ఈ గౌరవం యూకేలో భారతీయ సినిమాకు లభించిన అరుదైన గుర్తింపుగా భావిస్తున్నారు. కాగా ఈ విగ్రహాన్ని హ్యారీ పోటర్, బ్రిడ్జెట్ జోన్స్, మేరీ పాపిన్స్, బ్యాట్‌మాన్ వంటి దిగ్గజ పాత్రల పక్కన ఏర్పాటు చేయడం మరింత విశేషంగా భావిస్తున్నారు.
అయితే కథానుగుణంగా 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమా కొంత భాగం లండన్ లోనూ చిత్రీకరణ జరుపుకుంది. కథలో హీరో, హీరోయిన్ తొలిసారి కలుసుకొనే సీన్ ను లండన్ లోని లెయ్ సెస్టర్ ఏరియాలో చిత్రీకరించారు... ఇప్పుడు అదే ఏరియాలో హీరోహీరోయిన్లు షారుఖ్ ఖాన్, కాజోల్ కాంస్య విగ్రహాలను నెలకొల్పడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
Bade Bade Deshon Mein, Aisi Chhoti Chhoti Baatein Hoti Rehti Hain, Senorita!
— Shah Rukh Khan (@iamsrk) December 4, 2025
Thrilled to unveil the bronze statue of Raj & Simran at London’s Leicester Square today, celebrating 30 years of Dilwale Dulhania Le Jayenge (DDLJ)!
Incredibly delighted that DDLJ is the first Indian… pic.twitter.com/8wjLToBGYc
మ్యూజికల్ రూపంలో DDLJ..
మరోవైపు ఈ సినిమా ఈ సంవత్సరం మరో ప్రత్యేకతను చాటుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ ప్రేమకథ ఆధారంగా ఒక మ్యూజికల్ షో (సంగీత నాటకం) మాంచెస్టర్‌లోని ఒపేరా హౌస్‌లో విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ ఆంగ్ల ప్రొడక్షన్‌ను 'కమ్ ఫాల్ ఇన్ లవ్ - ది DDLJ మ్యూజికల్' పేరుతో ప్రదర్శించారు. ఈ మ్యూజికల్‌లో సిమ్రన్ ఒక యువ బ్రిటిష్ ఇండియన్ మహిళగా.. ఆమె ప్రేమించే వ్యక్తి రోజర్‌గా (భారతీయ పాత్ర కాదు) చూపించారు.
సినిమా స్టోరీ..
ఈ సినిమా కథ యూరప్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రేమలో పడే రాజ్, సిమ్రన్ అనే ఇద్దరు యువ ఎన్‌ఆర్‌ఐ (ప్రవాస భారతీయులు)ల చుట్టూ తిరుగుతుంది. సిమ్రన్ కుటుంబాన్ని ముఖ్యంగా ఆమె తండ్రి (బల్‌దేవ్ సింగ్)ని ఒప్పించి చివరికి ఎలా ఒకటయ్యారు అనేది స్టోరీ.
-
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications