బాలయ్యకు మాంచి దమ్మున్న స్క్రిప్ట్ వినిపించిన స్టార్ దర్శకుడు
నటసింహం నందమూరి నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం అఖండ 2 నిరాశపరిచింది. ఆయన కేరీర్ లో ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. భారీగా ట్రోల్స్ ను కూడా మూటగట్టుకుందీ మూవీ. బాలయ్యతో పని చేసిన అనుభవం ఉన్న బోయపాటి శ్రీను కూడా ఈ సినిమాను తెరకెక్కించడంలో తడబడ్డాడు. అటు కథాపరంగా గానీ, ఇటు గ్రాఫిక్స్ పరంగా గానీ ఏ మాత్రం జనాలను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
అఖండ తాండవం ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్నారు బాలకృష్ణ. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ఈ దఫా హిట్ కొట్టి తీరాలనే ఉద్దేశంలో ఉన్నారాయన. ఈ క్రమంలో ఓ మాంచి దమ్మున్న స్క్రిప్ట్ ను విన్నారు కూడా. దీనికి సంబంధించిన కథా చర్చలు ముగిశాయి. దీన్ని ఫైనలైజ్ చేయాలని బాలయ్య దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఫైనల్ అయితే గనక నిర్మాత, ఇతర వివరాలు తెర మీదకి వస్తాయి.

ఈ స్క్రిప్ట్ ను వినిపించింది మరెవరో కాదు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. మొత్తం రెండు బౌండ్ స్క్రిప్ట్ లను ఆయన రెడీ చేసుకున్నారు. ఇందులో బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా డిజైన్ చేశారు. బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ ను కొరటాల శివ రాసుకొచ్చారని చెబుతున్నారు. మరొకటి ఓ యంగ్ హీరోకు వినిపించే అవకాశాలు ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు కావొచ్చు. ఇది బాలకృష్ణకు 113వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
నిజానికి- దేవర 2 తెరకెక్కించాల్సి ఉంది కొరటాల శివకు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఆయన ఎదురుచూపులు సాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆయన అందుబాటులోకి వచ్చేంత వరకూ దేవర 2 ముందుకు కదలకపోవచ్చు. దీంతో ఖాళీగా ఉన్నారు కొరటాల శివ. ఈ గ్యాప్ ను సద్వినియోగం చేసుకుంటూ రెండు కొత్త స్క్రిప్ట్‌లను పూర్తి చేశారాయన. మరో స్క్రిప్ట్‌ను ఒక యువ నటుడి కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఆ నటుడిని ఖరారు చేయలేదు.












Click it and Unblock the Notifications