మెక్సికోలో వారణాసి ప్రివ్యూ పడింది.. !!
సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి. పాన్ వరల్డ్ లెవెల్ లో చిత్రీకరణ జరుపుకొంటోందీ మూవీ. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్లెస్ ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఇచ్చాయి. సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. రుద్రగా గతంలో ఎప్పుడూ చేయని రోల్ లో మెరుపులు మెరిపించబోతోన్నాడు మహేష్ బాబు. ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ది ఇందులో కీ రోల్.
ఎం.ఎం. కీరవాణి సంగీతం, వీ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వారణాసి యూనిట్ ఇదివరకే అధికారికంగా వెల్లడించింది. విజువల్ వండర్ గా తెరకెక్కుతోందీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. సినిమా మొత్తానికీ హైలైట్.. రామాయణం ఎపిసోడ్. అత్యంత సవాల్ తో కూడుకున్నది కూడా. దీన్ని అదే లెవెల్ లో తీసుకెళ్తోన్నారు మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌలి. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలకు మెక్సికోలో శ్రీకారం చుట్టారు. మెక్సికో సిటీలోని ప్రఖ్యాత CCXP Mexico 2026లో ప్రివ్యూ వేశారు.

ఈ సెషన్‌కు ఎస్ఎస్ కార్తికేయ సారథ్యం వహించారు. ఆయన స్వయంగా వారణాసి మెక్సికో ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా ప్రివ్యూ, ఇతర హైలైట్స్ కు సంబంధించి రాజమౌళి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. మెక్సికో ఈవెంట్ ను ఉద్దేశించి రూపొందించిన వీడియో క్లిప్ ఇది. ఇదివరకు ఎప్పుడూ చూడని తెరవెనుక (BTS) వీడియోలు ఉంటాయని తెలిపారు.
And here’s Producer @ssk1122 representing #VARANASI on the global stage at #CCXPMX26 ❤️ pic.twitter.com/kCdIAX6ayB
— Varanasi (@VaranasiMovie) April 25, 2026
CCXP Mexico అనేది లాటిన్ అమెరికాలోని అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్స్ లల్లో ఒకటి. పాన్ వరల్డ్ సినిమాలు, అంతర్జాతీయ స్థాయిలో తీసే ఫిల్మ్స్, టెలివిజన్, కామిక్స్, అనిమేషన్, గేమింగ్ అండ్ కాస్ప్లే వంటి అనేక విభాగాలను ఒకే వేదికపైకి తీసుకువస్తుందీ డయాస్. 2026వ ఎడిషన్ ప్రారంభమైందక్కడ. ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సందర్భాన్ని వారణాసి యూనిట్ వినియోగించుకుంది. అక్కడ ఈ సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ భారీ ఈవెంట్‌లో హౌస్ ఆఫ్ డ్రాగన్ నటులు మాట్ స్మిత్, ఒలివియా కూక్, ఫాబియన్ ఫ్రాంకెల్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. మిల్లీ ఆల్‌కాక్, దర్శకుడు క్రెయిగ్ గిల్లెస్పీ నటించిన సూపర్ గర్ల్ చిత్రాల ప్రదర్శించనున్నారు. వీటితో పాటు 'Star Trek: Strange New Worlds', 'The Mandalorian and Grogu' కు సంబంధించిన విశేషాలను అందిస్తారు.
#VIDEO | El director S. S. Rajamouli envió un video con un mensaje especial para sus fans CCXP México 2026, donde se presentó un primer adelanto de “Varanasi”… #GENTE
— REFORMA (@Reforma) April 25, 2026
🎥 Jacqueline Ponce León pic.twitter.com/kvVPGWKLrX












Click it and Unblock the Notifications