న్యూస్ పేపర్ చుట్టుకొచ్చిన హీరోయిన్..ఆ పేపర్ నాకు కావాలంటూ..!
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా దగ్గర కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీలలో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నమైంది దివి వద్త్య.
రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నటి దివి వద్త్య. 'మహర్షి', 'గాడ్ ఫాదర్' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించినా దక్కని గుర్తింపును, బిగ్ బాస్ షో ఒక్కటే ఆమెకు తెచ్చిపెట్టింది. మంచి హైట్, ఆకర్షణీయమైన ఫిజిక్ ఉన్నా, హీరోయిన్‌గా మాత్రం సరైన బ్రేక్ రాక దివి నిరాశలో ఉంది.

బిగ్ బాస్ తర్వాత వచ్చిన పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లు చేసినా.. అవి ఆమె కెరీర్‌కు అనుకున్నంత మైలేజ్ ఇవ్వలేకపోయాయి. ఇటీవల విడుదలైన 'లంబసింగి' సినిమా కూడా దివికి పెద్ద బ్రేక్ ఇవ్వడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివి తన మనసులోని బాధను, సినీ పరిశ్రమలోని కఠిన పరిస్థితులను బయటపెట్టింది.
అవకాశాల కోసం ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగానని, డైరెక్టర్లు, నిర్మాతలు రకరకాల కండీషన్లు పెట్టేవారని తెలిపింది. లావుగా ఉంటే సన్నగా అవ్వాలి, సన్నగా ఉంటే లావు అవ్వాలి అని చెప్పేవారు. వారి కోరిక మేరకు నా శరీర ఆకృతిని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డానని దివి ఎమోషనల్ అయ్యింది.
కెరీర్ విషయంలో ఇలాంటి నిరాశ ఉన్నప్పటికీ, దివి సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. పేపర్ షర్ట్ వేసుకొని దర్శనం ఇచ్చింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ న్యూస్ పేపర్ చిరిగిపోతే ఎవరిది బాధ్యతని కొందరు ప్రశ్నిస్తుండగా, ఇంట్లో న్యూస్ పేపర్లు ఎం లేవ ఇంకా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.ఆ పేపర్ నాకు కావలి... నేను చింపేస్తా...అంటూ మరో నెటిజన్ సరదాగా స్పందించారు. ప్రస్తుతం దివి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications