నలుగురితో ఎఫైర్,ఇద్దరితో పెళ్లి..ఈ హీరోయిన్ మామూల్ది కాదు భయ్యో ..!
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఓ హీరోయిన్ ఏకంగా నలుగురితో రిలేషన్ పెట్టుకుని ఇద్దర్ని వివాహం చేసుకుంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు...కునికా సదానంద్. ఈ భామ తెలుగు ప్రేక్షకులు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బాలీవుడ్ జనాలకు ఈ భామ సుపరిచితమే. ముఖ్యంగా హిందీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించి ఫుల్ పాపులర్ అయింది. మొదట టీవీ సీరియల్స్‌లో నటించిన కునికా సదానంద్, ఆ తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. కానీ సినీ రంగంలో సక్సెస్ అయిన కునికా సదానంద్, తన నిజ జీవితంలో మాత్రం ఫెయిల్ అయింది.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే, కునికా సదానంద్ మందుకు బానిసగా మారింది. ఇదే సమయంలో ఆమె వైవాహిక జీవితం కూడా అనేక ఒడిదుడుకులకు గురైంది. బ్రేకప్ తర్వాత నలుగురితో రిలేషన్ పెట్టుకున్నానని ఆమె స్వయంగా ఓ ఇంటర్య్వూలో తెలిపింది. వారితో రొమాన్స్ చేశానని ఈ భామ అంగీకరించింది.
మందుకు బానిసను అయ్యానని, ఆ సమయంలో అద్దంలో నన్ను నేను చూసుకుని షాక్ అయ్యానని కునికా సదానంద్ తెలిపింది.డ్రింకింగ్ మానేయాలని తన తండ్రి ఎంత చెప్పినప్పటికీ, నేను ఆయన మాట లెక్క చేయలేదని పేర్కొంది. ఇక కునికా రెండు పెళ్లిళ్లు చేసుకుంది. కునికా మొదట ముందుగా ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే భర్తతో విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత కొంతకాలం సింగిల్‌గా ఉన్న కునికా 35 ఏళ్ల వయస్సులో వినయ్ లాల్ అనే వ్యాపారిని వివాహం చేసుకుంది. వీరికి కూడా ఓ కుమారుడు ఉన్నాడు. రెండో భర్తతో కూడా కునికా సదానంద్ కాపురం చేయలేకపోయింది. దీంతో అతని నుంచి కూడా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సింగర్ కుమార్ సనుతో ప్రేమలో పడింది. అతనితో కూడా బ్రేకప్ చెప్పేసింది ఈ బ్యూటీ. కునికా సదానంద్ ప్రస్తుతం హిందీ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
-
ఆశా భోస్లే చివరి వీడియో వైరల్.. కదిలిస్తున్న దృశ్యాలు! -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
శోకసంద్రంలో చిత్రసీమ, లెజెండరీ సింగర్ కన్నుమూత! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..!












Click it and Unblock the Notifications