ఓటీటీని షేక్ చేస్తున్న "చిన్న సినిమా".. నాన్ స్టాప్ నవ్వుల జాతర!
MAD, MAD స్క్వైర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ నితిన్.. రవిబాబు 'Crrush' ఫేమ్ కృష్ణ బురుగల, యూట్యూబర్ ధీరజ్ ఆత్రేయ, 'The Birthday boy' ఫేమ్ మణి వక్కా కలిసి నటించిన సినిమా "జిగ్రీస్". హరీశ్ రెడ్డి ఉప్పల డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలోకి వచ్చింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది ఈ మూవీ. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఎలాంటి బూతు సన్నివేశాలు లేకుండా కుటుంబంతో కలిసి చూసే విధంగా తెరకెక్కడమే అందుకు ప్రధాన కారణం అని చెబుతున్నారు.
వల్గారిటీ లేని ఫ్రెండ్షిప్ ఎంటర్‌టైనర్..
ప్రస్తుతం ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ సినిమాలు అంటే బూతులు తప్పనిసరిగా ఉంటాయనే అభిప్రాయాన్ని 'జిగ్రీస్' పూర్తిగా మార్చేసింది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యతకు తావులేకుండా, కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ కథను ఎంతో పరిణితితో తెరకెక్కించారు. నలుగురు మిత్రుల ప్రయాణం, వారి మధ్య ఉన్న అనుబంధం, చిన్నచిన్న సంఘటనలతో వచ్చే నవ్వులు సినిమాకు ప్రధాన బలం.

ముఖ్యంగా ఈ చిత్రంలో కృష్ణ బురుగుల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తే, ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం కంటతడి పెట్టించేలా నటించారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయి సినిమాకు ప్రాణం పోశారు. నలుగురి మధ్య కెమిస్ట్రీ సినిమాను మరింత సహజంగా మార్చింది.
టెక్నికల్ టీమ్ బలం..
సయ్యద్ కమ్రాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు మంచి ఎమోషనల్ డెప్త్‌ను ఇచ్చాయి. ఈశ్వరదిత్య సినిమాటోగ్రఫీ ప్రతి సీన్‌ను సహజంగా చూపించగా, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ సినిమాను ఎక్కడా ల్యాగ్ లేకుండా ముందుకు నడిపించింది. ఈ మూడు విభాగాలు కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
సందీప్ రెడ్డి వంగా సపోర్ట్..
అంతే కాకుండా ఈ మూవీకి ర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మద్దతు ఉండటం మరో ప్రత్యేకత. ఆయన సపోర్ట్ ఈ సినిమాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. మొదటి సినిమానే అయినప్పటికీ, దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎంతో పరిపక్వతతో కథను హ్యాండిల్ చేశారని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్..
మరోవైపు ఓటీటీలోకి వచ్చిన కొద్ది సమయంలోనే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో మిలియన్ల వ్యూస్‌తో 'జిగ్రీస్' క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కామెడీ సీన్స్, ఎమోషనల్ మోమెంట్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశాయి. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను తెగ ఇష్టపడుతున్నారు.
-
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!











Click it and Unblock the Notifications