NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: హెర్కులెస్.. !!
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా డ్రాగన్. ఇది వర్కింగ్ టైటిల్. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న మూవీ ఇది. యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ గా ఇది తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో నిమగ్నం అయ్యాడు యంగ్ టైగర్. ఈ సినిమా షెడ్యూల్ రద్దయిందన్న వదంతులను వ్యాపించాయి. అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. అది నిజం కాదని, షూటింగ్ కొనసాగుతోందని నిర్మాతలు తేల్చి చెప్పారు.
దీన్ని నిజం చేస్తూ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వర్కవుట్స్ కు సంబంధించిన తాజా ఫొటో ఒకటి విడుదల అయింది. జిమ్ లో వర్కవుట్స్ చేస్తోన్న ఫొటో ఇది. ఈ ఉదయం ప్రొడక్షన్ యూనిట్ దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కండలు తిరిగిన శరీరంతో కనిపించాడు జూనియర్. అతని వీపు మాత్రమే కనిపించేలా తీసిన ఫొటో ఇది. హెర్కులెస్ లా మెలికలు తిరిగిన కండలను ప్రదర్శించాడిందులో. వీ-టాపర్ ఫిజిక్ చూపించాడు.

క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసెప్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోకు పోజులిచ్చాడు. భుజాలు దృఢమైన బైసెప్స్ డెఫినిషన్‌తో మెరిశాయి. ఓ మాంచి యాక్షన్ క్యారెక్టర్ కు తగ్గట్టుగా తనను తాను మలచుకుంటున్నాడు. డ్రాగన్ కు సమాంతరంగా దేవర 2 కూడా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుంది. ఈ రెండు చిత్రాల గురించి మరిన్ని అప్‌డేట్‌లు రాబోయే రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
The quieter it gets…
— #NTRNeel (@NTRNeelFilm) April 13, 2026
the louder it’s about to be. ⚡🔥#NTRNeel @tarak9999 pic.twitter.com/w4SB4xAVI2
వార్ 2 తర్వాత జూనియర్ నటిస్తోన్న మూవీ ఇదే. ఈ మూవీ నిరాశపరిచింది. అంతకుముందు దేవరలో డ్యూయెల్ రోల్ లో మెరుపులు మెరిపించాడు. ఈ ఫొటోకు సరితూగేలా ట్యాగ్ లైన్ పెట్టింది యూనిట్. చరిత్రలో నిలిచిపోవాలంటే మన దైనందిన జీవితంలో కూడా సంపూర్ణ నిశ్శబ్దం అవసరం. ఈ నిశ్శబ్దం అనేది ఓ భారీ మార్పునకు లేదా సంచలనానికి తెర తీస్తుంది. ఈ నిశ్శబ్దం గాఢత వెనుక మర్మం ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రతి కదలికకు ముందు ఉండే ఈ ప్రశాంతత, రాబోయే అతి పెద్ద ప్రభావానికి కారణమౌతుంది.. అని తెలిపింది.












Click it and Unblock the Notifications