Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ధర్మేంద్ర కన్నుమూత..: ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు భార్యలు హేమ మాలిని, ప్రకాష్ కౌర్, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. హీ మ్యాన్ గా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ధర్మేంద్ర మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది.

ఆయన మరణం పట్ల బాలీవుడ్ కు చెందిన నటులు, దర్శకులు, టెక్నీషియన్లు సంతాపం తెలియజేస్తోన్నారు. ఇటీవలే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలోనే మరణించినట్లు వార్తలొచ్చినప్పటికీ- కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. జుహూ నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ తెల్లవారు జాము నుంచి ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఇంట్లోనే లైఫ్ సపోర్ట్‌తో చికిత్స పొందారు. కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు.

Legendary Actor Dharmendra Passes away at 89

హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం ఆయన నివాసం వద్ద అంబులెన్స్ కనిపించడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆ కొద్దిసేపటికే ఇంటి వెలుపల బారికేడ్లు ఏర్పాటు చేశారు. ధర్మేంద్ర కన్నుమూసిన విషయాన్ని వెల్లడించారు. ఆయన భౌతికదేహానికి పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. హేమ మాలిని, ఈషా డియోల్‌, సన్నీ డియోల్, బాబీ డియోల్ తో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు నివాళి అర్పించారు.

ధర్మేంద్ర మరణం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్వార్త తెలిసిన వెంటనే, పలువురు బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు ధర్మేంద్ర ముంబై నివాసానికి చేరుకుంటోన్నారు. ఇంటి వెలుపల విషాదకర వాతావరణం నెలకొంది. అభిమానులు కూడా తమ ఆరాధ్య నటుడికి చివరి వీడ్కోలు పలకడానికి భారీగా తరలివస్తోన్నారు.

1950వ దశకంలో సినీ రంగ ప్రవేశం చేశారు ధర్మేంద్ర. దేశ చలన చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోయే సినిమా 'షోలే'లో నటించారు. 'ఫూల్ ఔర్ పత్థర్', 'చుప్కే చుప్కే', 'సత్యకామ్', 'సీతా ఔర్ గీత', 'యాదోన్ కి బారాత్' వంటి ఐకానిక్ చిత్రాల్లో తన నటనతో ఫిల్మ్ ఇండస్ట్రీపై తనదైన ముద్ర వేశారు. స్క్రీన్ ప్రెజెన్స్‌తో యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషనల్ డ్రామాతో కొన్ని తరాల పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+