బాలయ్య కుమార్తె పాత్రలో మహేష్ బాబు డాటర్ "సితార".. కానీ !!
నందమూరి బాలకృష్ణ "అఖండ 2" మానియా థియేటర్లను షేక్ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. వారి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా వచ్చింది ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్ గా నటించగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. తమన్ మరోసారి తన సంగీతంతో స్పీకర్స్ బద్దలు కొట్టారు. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. మొత్తంగా వరుసగా ఐదో హిట్ కూడా కూడా అందుకున్నారని అభిమానులు చెబుతున్నారు.
కాగా బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బాలకృష్ణ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని అంటున్నారు. ఇక అఖండ 2 చివర్లో 'జై అఖండ' పేరుతో 'అఖండ 3' రానున్నట్లు టైటిల్స్ వేసి మూడో భాగం ఉండనున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు.

కాగా ఈ సినిమాలో బాలయ్య తర్వాత అంతటి ముఖ్య పాత్ర అంటే.. ఆయన కుమార్తె జనని పాత్ర అనే చెప్పాలి. ప్రధానంగా సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు. అలాంటి ముఖ్య పాత్రలో తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది హర్షాలీ మల్హోత్రా. బాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ సినిమాలో మున్నీ పాత్రతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెను అనుకున్నారట బోయపాటి. కానీ అనుహ్యంగా చివర్లో హర్షాలీకి ఆ అవకాశం దక్కిందని టాక్ వినిపిస్తోంది. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేనిని ఈ పాత్ర కోసం ప్లాన్ చేశారట. కానీ అనుకోని కారణాల వల్ల హర్షాలీ నటించినట్టు అంటున్నారు. కానీ ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో సితార నటించి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేదని భావిస్తున్నారు.

-
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..?












Click it and Unblock the Notifications