ఆధ్యాత్మికత + అడ్వెంచర్: నాగబంధం టీజర్ అదుర్స్.. !!
భారీ అంచనాల మధ్య 'నాగబంధం' మైథో-యాక్షన్ సినిమా టీజర్ విడుదలైంది. విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించాడు. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నారా ఈ సినిమాను సమర్పించారు. ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. మహాశివరాత్రి పర్వదినాన్నిపురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టీజర్‌ను ఆవిష్కరించారు. దీని తొలి గ్లింప్స్ సినిమాకు మంచి హైప్ ఇచ్చింది.
ఎక్కడే గానీ ఒక్క డైలాగ్ కూడా లేని టీజర్ ఇది. ఆధ్యాత్మికతకు అడ్వెంచర్ ను జోడించారు. ఓ అద్భుతమైన విజువల్స్ వండర్ గా నిలిచిందీ టీజర్. మంచుతో కప్పుకొని పోయిన అసేతు హిమాలయాల్లో కాలాతీత రహస్యంతో పాటు కాస్మిక్ ఎనర్జీని కాపాడే అత్యంత శక్తిమంతమైన 'నాగబంధం' ఆలయం చుట్టూ కథ అల్లినట్లు తెలుస్తోంది. ఆ ఆలయం అపారమైన శక్తిని కలిగి ఉండటం, అది దుర్మార్గుల చేతుల్లోకి వెళ్తే ఊహించని వినాశనానికి దారితీస్తుందని టీజర్ చూపించింది.

"బ్రహ్మ సృష్టి నుంచి.. విష్ణు ధర్మంతో.. మహాదేవుని క్రోధంతో.." అనే లైన్ ఈ చిత్ర ప్రధాన ధీమ్. దైవత్వం, విధి, విధ్వంసాల కలయికగా చెప్పుకోవచ్చు. భారీ యాక్షన్, ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూపిందీ టీజర్. ఇది పురాణాలు, చరిత్ర, ఆధ్యాత్మిక యుద్ధ అంశాలను మేళవింగా కనిపించింది. అబ్దాలీ దండయాత్ర నుండి పాక్షికంగా ప్రేరణ పొందింది. రౌద్రావతారంలో మెరిశాడు విరాట్ కర్ణ. మొసలితో పోరాటం వంటి సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచాయి. విజువల్స్‌తోనే టీజర్ ఉత్సుకత పెంచింది.
The #WorldOfNagabandham looks absolutely fascinating all the way…. Looking forward to experiencing it soon.. 🤗🤗🤗https://t.co/slsS18887c#Nagabandham #AbhishekNama@ViratKarrna @NabhaNatesh @Ishmenon #KishoreAnnapureddy @Nishithareddy85 @nikstudiosindia @AbhishekPicture
— Mahesh Babu (@urstrulyMahesh) February 15, 2026
బలమైన సాంకేతిక బృందం ఈ సినిమాకు జీవం పోసింది. సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ సినిమా స్థాయిని పెంచాయి. జునైద్ కుమార్ నేపథ్య సంగీతం గూస్ బంప్స్. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ గొప్ప నిర్మాణ విలువలను టీజర్ ను బలోపేతం చేశాయి. నటీనటుల ఎంపిక ప్రాజెక్ట్‌కు పెద్ద బలం. నభా నటేష్, ఇష్మేశన్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, రిషబ్ సాహ్నీ, గరుడ రామ్, జయప్రకాష్, మురళి శర్మ, అనసూయ భరద్వాజ్, బీఎస్ అవినాష్ కీలక పాత్రల్లో నటించారు.












Click it and Unblock the Notifications