నందమూరి ఫ్యాన్స్‌కి బాలయ్య స్వీట్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ ఆ మూవీ తోనే !!
నందమూరి నటసింహం బాలయ్యకి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఒక వైపు రాజకీయంగా తన తండ్రి పెట్టిన తెలుగు దేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు సినిమాల్లో కూడా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు.
కాగా వరుస బ్లాక్‌బస్టర్లతో జోరు మీదున్న బాలకృష్ణ నందమూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్ లీక్ చేశారు. తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎప్పటినుంచో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ గుడ్ న్యూస్ వెల్లడించారు. ఆయన కెరీర్ లో టాప్ చిత్రంగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ మూవీ "ఆదిత్య 369"కు సీక్వెల్‌గా రానుంది. త్వరలోనే ఆ మూవీకి "ఆదిత్య 999 మ్యాక్స్" పేరుతో సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు స్పష్టం చేశారు.

అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే వస్తుంది. ఈ చిత్రంలో నేను, మోక్షజ్ఞ కలిసి నటిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఓ తీపికబురు అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
కాగా 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో "ఆదిత్య 369" సినిమా తెరకెక్కింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌కు క్రిష్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఈ భారీ ప్రాజెక్టుతోనే ఉంటుందా? లేదా అంతకంటే ముందుగా మరో సోలో చిత్రంతో హీరోగా వస్తారా అని జోరుగా చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోగా.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications