Pawan Kalyan చేసిన సహాయాన్ని చెప్పిన అల్లు అర్జున్ మేనేజర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా పవన్ - బన్నీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో 'ఫ్యాన్ వార్స్' నడుస్తున్న తరుణంలో, స్వయంగా బన్నీ మేనేజర్ పవన్ కళ్యాణ్ చేసిన సహాయం గురించి చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అద్భుతంగా స్పందించిన పవన్
ఒకసారి కాకినాడకు వెళుతున్న తనకు పిఠాపురం ప్రాంతానికి చెందిన ఓ డ్రైవర్ కలిశాడని శరత్ చంద్ర వివరించారు. ఆ డ్రైవర్ తన కుమార్తె ఎదుర్కొంటున్న అరుదైన ఆరోగ్య సమస్యను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. దాదాపు 50 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే వింత వ్యాధితో బాధపడుతున్న తన బిడ్డను కాపాడుకోవడానికి ఎందరిని వేడుకున్నా ఫలితం లేకపోయిందని, చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను ఆపి తన ఆవేదన వ్యక్తపరచగా, ఆయన అద్భుతంగా స్పందించారని శరత్ తెలిపారు.

తన సొంత జీతం నుంచి నిధులు
పవన్ కళ్యాణ్ ఆ చిన్నారి పరిస్థితిని చూసి వెంటనే స్పందించి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఐజీ హాస్పిటల్‌కు పంపేలా ఏర్పాట్లు చేశారు. కేవలం వైద్యం చేయించడమే కాకుండా, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని తన వ్యక్తిగత నిధుల నుంచి ప్రతి నెలా రూ. 12,000 చొప్పున సాయం చేస్తున్నారు.
అంతేకాదు.. పిఠాపురం నియోజకవర్గంలో 42 మంది అనాథ చిన్నారులకు పవన్ అండగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా తాజాగా తన దృష్టికి వచ్చిన మాధవపురానికి చెందిన సత్య, చైతన్య అనే ఇద్దరు చిన్నారుల దీనగాథకు కూడా డిప్యూటీ సీఎం చలించిపోయారు. వారిని కూడా తన సంరక్షణలోకి తీసుకున్నారు. దీంతో మొత్తం 48 మంది అనాథ చిన్నారుల బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకున్నట్లైంది.
ఇద్దరు హీరోల అభిమానుల ప్రశంసలు
ఈ 48 మంది చిన్నారుల పోషణ కోసం తన సొంత జీతం నుంచి ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున అందజేస్తున్నారు. తన పదవీకాలం ముగిసే వరకు ఈ ఆర్థిక సాయం నిరంతరాయంగా కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ చేస్తున్న సాయాన్ని ప్రచారం చేసుకోకుండా, మానవతా దృక్పథంతో ఆయన చేస్తున్న ఈ సేవలపై పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications