శివ కార్తీకేయన్ - శ్రీలీల 'పరాశక్తి' మూవీ ఫస్ట్ రివ్యూ..!

వ కార్తికేయన్.. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నారు స్టార్ హీరో. తనదైన శైలిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి తక్కువ సమయంలో స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు.. తమిళంలో బుల్లితెరపై అనేక కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన హోస్ట్ చేసిన దిస్, జోడి వంటి షోలన్నీ తమిళ అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందాయి. 2012లో పాణిరాజ్ దర్శకత్వం వహించిన మెరీనా చిత్రంతో శివ కార్తికేయన్ వెండితెరపై అడుగుపెట్టాడు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించి.. ధనుష్, శ్రుతి హాసన్ జంటగా నటించిన 3వ చిత్రంలో ధనుష్ స్నేహితుడిగా నటించారు.

రీసెంట్ గానే అమరన్ మూవీతో తెలుగువాళ్లకి కూడా దగ్గరైపోయారు. మేజర్‌ ముకుంద్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవితో జంటగా నటించారు. తన నటనతో ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తెప్పించారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజై మంచి వసూళ్లు రాబట్టింది. చివరగా మురగదాస్ దర్శకత్వంలో "మదరాసి" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా తన సత్తా చాటుతున్నారు.

sivakarthikeyan-and-srileela-starring-parashakti-movie-review-by-censor-board

కాగా ఇప్పుడు శివకార్తీకేయన్ - స్టార్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'పరాశక్తి'. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ ఇండియన్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామాను జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీలో హీరోలు రవి మోహన్, అథర్వ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కులప్పూలి లీల, దేవ్ రమానాథ్, పృథ్వీ రాజన్, బసిల్ జోసెఫ్, షాజీ చెన్, పాప్రి ఘోష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంగా తెరకెక్కింది.

యూఏ సర్టిఫికెట్‌..

అయితే సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి షాక్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను, హిందీ వ్యతిరేక సంభాషణలను తొలగించాలని సూచించింది. దీంతో నిర్మాతలు, దర్శకులు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. చిత్ర నేపథ్యం హిందీ వ్యతిరేక ఉద్యమం కావడంతో.. కీలక సన్నివేశాలను తొలగిస్తే సినిమా యొక్క మూల ఉద్దేశ్యం నెరవేరదని వివరించారు. ఈ వాదనలతో సంతృప్తి చెందిన రివైజింగ్ కమిటీ చివరకు యూఏ (U/A 16+) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీని ప్రకారం 16 ఏళ్లు పైబడిన వారు ఈ సినిమాను చూడొచ్చు; అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాలని నిబంధనలు పేర్కొన్నాయి.

sivakarthikeyan-and-srileela-starring-parashakti-movie-review-by-censor-board

రన్ టైమ్..

ఈ మూవీ రెండు గంటల 35 నిమిషాల (155 నిమిషాలు) నిడివితో రూపొందినట్టు తెలుస్తోంది.

సినిమా ఎలా ఉందంటే..?

రాజేంద్రన్ పాత్రలో శివకార్తీకేయన్ నటన.. రవి మోహన్, అథర్వ కూడా యాక్టింగ్ అదరగొట్టారు. అలాగే ఉద్యమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత తమిళ తరానికి చరిత్రను గుర్తుచేస్తూ, వినోదంతో పాటు చైతన్యాన్ని రగిలించే లక్ష్యంతో తెరకెక్కిందని చర్చ జరుగుతోంది. ఎలాంటి సాగదీతలు లేకుండా పక్కాగా కట్ చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+