వారణాసి క్రేజీ అప్‌డేట్:మహేష్ బాబుకు తండ్రిగా ఆ విలక్షణ నటుడే,జక్కన్న ప్లాన్!

స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ఈ మూవీకి సంబంధించి ఇదివరకే రామోజీఫిలిం సిటీ వేదికగా గ్లోబ్‌ట్రాటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ఈవెంట్‌ వేదికగా సినిమా పేరును,మోషన్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వారణాసి చిత్ర బృందం నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఇంతకీ ఆ అప్‌డేట్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

భారీ అంచనాలు
జక్కన్న వెండితెరపై చెక్కబోతోన్న మరో అద్భుత కావ్యం వారణాసి.ఇటు భారీ బడ్జెట్ చిత్రాలతో భారీ విజయం సాధిస్తోన్న రాజమౌళి ఒకవైపు...సౌత్‌లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందని ఇటు మూవీ లవర్స్ అటు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ప్రియాంకా చోప్రా మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఈ సినిమా క్రేజ్ మరో లెవెల్‌కు వెళ్లిపోయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు లుక్‌కు అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు. ఇక మోషన్ పోస్టర్‌లో మహేష్ బాబు నందిపై రావడం చూసిన అభిమానులకు గూస్ బంప్స్ వచ్చాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ssmb29-varanasi-cast-update-prakash-raj-joins-as-mahesh-babus-father-global-buzz

తాజా అప్‌డేట్
వారణాసి చిత్ర బృందం మరో తాజా అప్‌డేట్‌తో వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రిగా ఓ విలక్షణ నటుడు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయనే ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఈ మధ్య రాజకీయాల్లో కాస్త బిజీగా ఉన్నప్పటికీ... ఆయన వద్దకు వస్తున్న క్యారెక్టర్లను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అలాంటి ఓ మంచి ఆఫరే రాజమౌళి ప్రకాష్ రాజ్ ముందుంచాడు. జక్కన్న చెప్పిన స్టోరీతో ప్రకాష్ రాజ్ కన్విన్స్ అయినట్లు ఫిలింనగర్ టాక్. ఇక వెంటనే వారణాసి సెట్స్‌లో ప్రత్యక్షమయ్యాడు ప్రకాష్ రాజ్. మహేష్ బాబుకు ప్రకాష్ రాజ్ తండ్రిగా గతంలో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు వంటి చిత్రాల్లో నటించారు. ఇద్దరి మధ్య నడిచే సీన్లు,డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి.

ప్రకాష్ రాజ్‌కే జక్కన్న ఓటు
ప్రకాష్ రాజ్‌ కంటే ముందు రాజమౌళి ఒకరిద్దరు సీనియర్ ఆర్టిస్టులను మహేష్ బాబు తండ్రి పాత్రకు అనుకుని టెస్ట్ షూట్ కూడా చేశారు. కానీ జక్కన్న ఎక్కడా కాంప్రమైజ్ కాడనే విషయం తెలిసిందే. ఇది ఆయన సినిమాల్లోని క్వాలిటీని చూస్తే అర్థమవుతుంది. సో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రంలో కూడా రాజమౌళి కించిత్ అయినా రాజీపడటం లేదు. ఒక పాత్రకు 100 శాతం సంపూర్ణ న్యాయం ఎవరు చేయగలిగితే వారివైపే మొగ్గు చూపుతున్నాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తండ్రిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేశాడు జక్కన్న.ప్రకాష్ రాజ్ ఇప్పటికే సినిమా షూటింగులో పాల్గొనట్టు ఫిలింనగర్‌లో వార్త ప్రచారంలో ఉంది.

మొత్తానికి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న వారణాసి చిత్రం 2027 జనవరిలో లేదా వేసవి సెలవుల్లో విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మళయాల సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మహేష్ బాబు ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. మరో ఇంటర్నేషనల్ అవార్డును జక్కన్న తప్పక తీసుకొస్తారనే చర్చ నెట్టింట్లో జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+