మన స్టార్ హీరోల పారితోషికం తెలుసుకుంటే నోరెళ్లబెడతారు

తెలుగు సినీ చరిత్రలో ఉన్నంతమంది స్టార్ హీరోలు మరే భాషలో కూడా లేరు. అందుకే పాన్ ఇండియా పరంగా కూడా తెలుగు సినీ పరిశ్రమదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఉత్తరాది దర్శకులు కూడా మన తెలుగు స్టార్ హీరోలతోనే సినిమాలు తీయాలనుకుంటున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందరూ తెలుగు హీరోలనే ఆదరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. హిందీలో ఉన్న అమీర్ ఖాన్, సల్మాన ఖాన్, షారుక్ ఖాన్ లాంటివారు వయసులో పెద్దవారయ్యారు. అలాగే రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ లాంటివారు కూడా దక్షిణాదిలో పెద్దవారయ్యారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి యువ హీరోలను బాగా ఆదరిస్తున్నారు.

అందరూ పాన్ ఇండియా హీరోలే

సినిమా సినిమాకు ఈ యువ హీరోలు తమ పారితోషికాన్ని పెంచుకుంటూనే వెళుతున్నారు. తమ మార్కెట్ పరిధిని కూడా బాగా విస్తరించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హీరోలు చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళంతోపాటు బెంగాలీకానీ, మరాఠీ భాషల్లోకానీ నిర్మాతలు విడుదల చేస్తున్నారు. సినిమాకు తగినట్లుగా కథ, కథనాలు, దర్శకత్వ ప్రతిభ ఉంటే సూపర్ హిట్ ఖాయం. దేశవ్యాప్తంగా ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ హీరోలంతా ఎంత పారితోషికం తీసుకుంటున్నారు? అనే సందేహం అందరినీ తొలిచేస్తోంది. ఎందుంటే అంత భారీ హిట్లు సాధిస్తున్నవారు కోట్ల రూపాయలు తీసుకుంటారని తెలుసుకానీ ఎంతని తెలియదు. అయితే మన స్టార్ హీరోలంతా ఎంత తీసుకొంటున్నారనే వివరాలను తెలుసుకుందాం.

Tollywood If you know the remuneration of our star heroes you will be shocked

ప్రభాస్ రూ.200 కోట్లు తీసుకుంటున్నారు

అందరికంటే అధికంగా ప్రభాస్ రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. తర్వాత అల్లు అర్జున్ రూ..125 నుంచి రూ. 150 కోట్ల వరకు, మహేష్ బాబు రూ.120 కోట్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు రూ.200 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ కూడా రూ.120 కోట్లు, జూనియర ఎన్టీఆర్ రూ.100 కోట్లు, పవన్ కల్యాణ్ రూ.80 కోట్లు, చిరంజీవి రూ.60 కోట్లు, బాలయ్య రూ.40 కోట్లు తీసుకుంటున్నారు. వెంకటేష్ రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు, నాగార్జున రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. కొందరు హీరోలు సినిమా లాభాల్లో వాటాలు, మరికొందరు థియేట్రికల్ హక్కులు, మరికొందరు హీరోలు ఓటీటీ హక్కులు.. ఇలా కూడా తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+