నో గ్యాప్- షూటింగ్ రెజ్యూమ్ పెళ్లి తర్వాత తొలిసారి కెమెరా ముందుకు విజయ్, రష్మిక

విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. రణబాలి. రష్మిక మందన ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తోన్నారు. త్వరలో రణబాలి ఫిల్మ్ షూటింగ్ లో రీజాయిన్ కానున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి కెమెరా ముందుకు రాబోతోండటం ఇదే తొలిసారి. పెళ్లి ఏర్పాట్ల నేపథ్యంలో దాదాపుగా నెల రోజుల గ్యాప్ తర్వాత వీరి షెడ్యూల్ రెజ్యూమ్ కాబోతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి షూటింగ్ పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

పెళ్లి తర్వాత నెల రోజుల పాటు షూటింగ్ ల నుంచి విరామం తీసుకోవాలని మొదట్లో భావించినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చట్లేదు. చేతిలో ఉన్న రణబాలి మూవీని కంప్లీట్ చేయాలని నవ దంపతులిద్దరూ నిర్ణయించారనేది ఫిల్మ్ నగర్ టాక్. రణబాలి తదుపరి షూటింగ్ షెడ్యూల్‌ ఈ నెల 12న ప్రారంభించనున్నారని తెలుస్తోంది. వివాహం తర్వాత వారిద్దరూ కలిసి నటిస్తోన్న తొలి సినిమా ఇదే కావటం వల్ల క్రేజ్ ఏర్పడింది.

Vijay Deverakonda and Rashmika Mandanna set to Resume Ranabaali Movie Shoot After Wedding Ends Pause

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోందీ చిత్రం. 2018లో విడుదలైన హారర్ థ్రిల్లర్ టాక్సీవాలా తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యన్- విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తోందీ మూవీ. 1854- 1878 మధ్య బ్రిటిష్ పాలన సమయంలో దేశంలో జరిగిన వాస్తవ సంఘటనలను ప్రేరణగా తీసుకుని చిత్రం కథను తిర్చిదిద్దారు.

బ్రిటీష్ పాలకుల అణచివేతను ప్రతిఘటించే స్వాతంత్ర్య సమరయోధుడు 'రాణబలి' టైటిల్ క్యారెక్టర్ ను పోషిస్తున్నాడు విజయ్ దేవరకొండ. రష్మిక మందన 'జయమ్మ' పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న ఫొటోను చిత్రం యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 19వ శతాబ్దం చివర నాటి వాతావరణాన్ని, ఆ కాలపు ఛాయాచిత్రంలా దీన్ని రూపొందించారు. వింటేజ్ పోర్ట్రెయిట్స్‌లో కనిపించేలా డిజైన్ చేశారు. ఆనాటి వివాహ సంప్రదాయాలు ఉట్టిపడేలా కనిపించిందీ ఫొటో.

'ది మమ్మీ' ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటీష్ అధికారిగా విలన్ క్యారెక్టర్ ను పోషిస్తోన్నాడు. పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్, కర్నూలు సహా పలు ప్రాంతాల్లో జరుగనుంది. అ సినిమా లో వర్కింగ్ టైటిల్, స్టిల్.. ఇదివరకే విడుదల అయింది. విజయ్ దేవరకొండ 36వ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది మే 9వ తేదీన వర్కింగ్ టైటిల్, స్టిల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+