టీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు: 16లోగా దరఖాస్తు చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో రీజియన్ల వారీగా 150 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన అర్హతలు, తదితర వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
అర్హత: బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ ఉత్తీర్ణత.
వయో పరిమితి: 01.07.2022 నాటికి 21-35 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి.
స్టైఫండ్: మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ. 15వేలు, రూ. 16వేలు, 17వేలు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ధృవపత్రాల పరిశీలన, స్థానికత ఆధారంగా.
దరఖాస్తు సమర్పణకు ముందు www.mhrdnats.gov.in లో వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే వెబ్‌సైట్‌లో టీఎస్ఆర్టసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్ ఐడీ ద్వారా అక్టోబర్ 16, 2022లోగా దరఖాస్తు చేయాలి.
మరిన్ని వివరాల కోసం www.tsrtc.telangana.gov.in/ సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications