Admit cards : 31న ఎపీ యానిమల్‌ హజ్బెండరీ ప‌రీక్ష‌... రేపు అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌..

Admit cards : 31న ఎపీ యానిమల్‌ హజ్బెండరీ ప‌రీక్ష‌... రేపు అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌ : ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధక శాఖలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ పోస్టుల నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కూడా ముగిసింది. అయితే, ఈ పోస్టుల‌కు సంబంధించిన ప‌రీక్ష డిసెంబరు 31న ఉంటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పశుసంవర్థక శాఖలో 1896 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సచివాలయాలకు అనుబంధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో పశు సంవర్థక సహాయకులు (Animal Husbandry Assistant) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల‌కు సంబంధించి నవంబ‌ర్ 20 నుంచి డిసెంబ‌ర్ 11 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు కూడా స్వీక‌రించారు.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల‌కు అభ్యర్థులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. అయితే, ఈ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన అడ్మిట్‌కార్డుల‌ను ఈ నెల 27 వ తేదిన అంటే రేప‌టి నుంచి విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నెల 31వ తేదీన ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు జనవరిలో జాయినింగ్ లెటర్స్ అందజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదట రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియ‌డ్ ఉంటుంది. ఆ సమయంలో రూ.15,000 చొప్పున జీతం చెల్లిస్తారు. ప్రొబెష‌న్ పీరియ‌డ్ అనంత‌రం నెలకు రూ.22,460 వ‌ర‌కూ జీతం ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://apaha-recruitment.aptonline.in/ ఈ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు.

 Admit cards : AP Animal Husbandry exam on 31st... Admit cards to be released tomorrow..

పోస్టుల వివ‌రాలు..

పశ్చిమ గోదావరి జిల్లా- 102,
తూర్పు గోదావరి జిల్లా- 15,
అనంతపురం జిల్లా- 473,
చిత్తూరు జిల్లా- 100,
కర్నూలు జిల్లా- 252,
కడప జిల్లా- 210,
గుంటూరు జిల్లా- 229,
కృష్ణా జిల్లా- 120,
నెల్లూరు జిల్లా- 143,
ప్రకాశం జిల్లా- 177
విశాఖపట్నం జిల్లా- 28,
విజయనగరం జిల్లా- 13,
శ్రీకాకుళం జిల్లా- 34,

కంపూట్య‌ర్ ఆధారిత ప‌రీక్ష‌..

ఈ ప‌రీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు.
ఇందులో పార్ట్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. 50 మార్కులు-50 నిమిషాలు.
పార్ట్-బి : యానిమల్ హస్బెండరీ సబ్జెక్టు నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు 100 మార్కులు-100 నిమిషాలు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధించ‌డం జ‌రుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+