టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఏఈఈ హాల్ టికెట్లు
హైదరాబాద్: తెలంగాణలో మరో ఉద్యోగ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నట్లు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రదన్ తెలిపారు. మే 21, 22 తేదీల్లో సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మంగళవారం నుంచి పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ తెలిపారు. పరీక్షలకు సంబంధించి మాక్‌లింక్ వెబ్‌సైట్‌లో ఉందని, అభ్యర్థులు ముందుగా ప్రిపేర్ కావాలని సూచించారు.

మంగళవారం నుంచి పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. పరీక్షలకు సంబంధించి మాక్‌లింక్ వెబ్‌సైట్‌లో ఉన్నదని, అభ్యర్థులు ముందుగా ప్రిపేర్ కావాలని సూచించారు.
ఏఈఈ హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) మంగళవారం కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షను పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్ పద్ధతిలోనే జరుపనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
గ్రూప్-1 పరీక్ష గత అక్టోబర్ 16న జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 2,85,916 మంది పరీక్షను రాశారు. వీరిలో 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే అనూహ్యంగా గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు మరికొన్ని పరీక్షలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.
అనంతరం మళ్లీ కొత్త తేదీలను ప్రకటించిన కమిషన్.. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పరీక్ష విభాగాన్ని తీసుకొచ్చింది. టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా బీఎం సంతోష్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఎన్ జగదీశ్వర్ రెడ్డిని నియమించింది.












Click it and Unblock the Notifications