ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: ఆ రాష్ట్రాలవారే అప్లై చేయండి
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) తూర్పు ప్రాంతంలోని వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- aai.aeroలో అక్టోబర్ 12, 2022 నుంచి జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్), సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్), సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఏఏఐ తూర్పు రీజియన్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 12, 2022
దరఖాస్తు, దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 10, 2022
ఆన్‌లైన్ పరీక్ష తాత్కాలిక తేదీని ఏఏఐ తన అధికారిక వెబ్‌సైట్ aai.aeroలో ప్రకటిస్తుంది
తూర్పు ప్రాంతంలో ఖాళీలు:
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 32 పోస్టులు
పే స్కేల్ (ఐడీఏ) - రూ.31,000 -3%- రూ. 92,000
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్‌లో కనీసం 50%తో 3 సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా కలిగి ఉండాలి.
వీరితో పాటు 50% మార్కులతో 12వ తరగతి (రెగ్యులర్ కోర్సు) ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా సెప్టెంబరు 30, 2022 ప్రకటన తేదీకి కనీసం ఒక సంవత్సరం ముందు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే మీడియం వెహికల్ లైసెన్స్ లేదా ప్రకటన తేదీకి కనీసం రెండేళ్ల ముందు జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే లైట్ మోటర్ వెహికల్ లైసెన్స్‌ని కలిగి
ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 9 పోస్టులు
పే స్కేల్ (ఐడీఏ) - రూ. 36,000 -3%- రూ. 1,10,000
ఈ పోస్టులకు ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్//రేడియో ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 6 పోస్టులు
పే స్కేల్ (ఐడీఏ) - రూ 36,000 -3%- రూ 1,10,000
ఈ పోస్టులకు, 3 నుంచి 6 నెలల కంప్యూటర్ శిక్షణ కోర్సుతో పాటు బీకామ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం అవసరం.
ఈ పోస్టులకు వయోపరిమితి సెప్టెంబర్ 30, 2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 1000 చెల్లించవలసి ఉంటుంది, అయితే స్త్రీ/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్‌మెన్/ఆక్షన్‌లో మరణించిన మాజీ సైనికుడిపై ఆధారపడినవారు/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు/అప్రెంటిస్‌లు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అండమాన్, నికోబార్ దీవులు, సిక్కిం రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే పై పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరని గమనించాలి.
ఏఏఐ రిక్రూట్‌మెంట్ 2022 అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications