TS SSC Results 2024: రేపే తెలంగాణ టెన్త్ రిజల్ట్స్- ఇలా తెలుసుకోండి..!
తెలంగాణలో ఈ ఏడాడి నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్దమైంది. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలకు అవసరమైన అన్ని చర్యల్ని అధికారులు తీసుకుంటున్నారు. అలాగే ఫలితాలు విడుదల కాగానే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి విద్యార్దులు వాటిని తెలుసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రేపు ఫలితాలు విడుదల కాగానే విద్యార్ధులు బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.inలోకి వెళ్లి ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. వీటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే ఈసారి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారి కోసం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా రేపు వెల్లడించనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పదో తరగతి ఫలితాలను అధికారులు త్వరగా విడుదల చేస్తున్నారు.












Click it and Unblock the Notifications