అమెజాన్ కెరీర్ డే: 8 వేల మందికి ఉపాధి, నాలుగేళ్లలో 10 లక్షల మందికి జాబ్స్..?
ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్.. ఈ నెల 16, 17వ తేదీల్లో కెరీర్ డే నిర్వహిస్తోంది. ఉద్యోగులతో సీఈవో సహా వివిధ విభాగాల అధిపతులు ఇంటరాక్ట్ అవుతారు. అలాగే అమెజాన్‌లో ఉన్న ఖాళీల గురించి కూడా స్పష్టత వచ్చింది. 8 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే అమెజాన్ తొలిసారి కెరీర్ డే నిర్వహిస్తోంది. అయితే అధిపతులతో.. ఉద్యోగులు వర్చువల్‌గా మీట్ అవుతుంటారు.
కంపెనీ ఉన్నతి కోసం ఏం చేయాలి.. సమాచారం షేర్ చేసుకోవడం.. లాంటి అంశాల గురించి డిస్కష్ చేస్తారు. సీఈవో ఆండీ జస్సీ తన అనుభవాలను వివరిస్తారు. గ్లోబల్ సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ కీలక అంశాల గురించి ప్రస్తావిస్తారు. 140 మంది 2 వేల మందికి వివిధ అంశాలపై బోధిస్తారు. ఉపాధి కల్పన, ఇంటర్వ్యూ టిప్స్ ఎలా పాటించాలనే అంశం గురించి చర్చిస్తారు.

దేశంలోని 35 నగరాల్లో 8 వేల మందికి ఉపాధి అందిస్తామని చెబుతోంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, ముంబై, కోల్ కతా, నోయిడా, అమృత్ సర్, అహ్మదాబాద్, భోపాల్, కోయంబత్తూర్, జైపూర్, కాన్పూర్, లుధియానా, పుణె, సూరత్ లాంటి నగరాల్లో ఉపాధి కల్పించాల్సి ఉంది. కార్పొరేట్, టెక్నాలజీ, కస్టమర్ సర్వీస్ విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం అమెజాన్‌లో 1 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్, సైన్సెస్, బిజినెస్ మేనెజ్ మెంట్, సప్లై చైన్, ఆపరేషన్స్, ఫైనాన్స్, హెచ్ఆర్, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సెక్యూరిటీ, వీడియో, మ్యూజిక్, విభాగాల్లో పలువురు పనిచేస్తున్నారు. 2025 వరకు ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 10 లక్షల ఉద్యోగాలను భారతదేశంలో ఇస్తామని కంపెనీ చెబుతోంది.












Click it and Unblock the Notifications