ఏపీ జాబ్ క్యాలెండర్: 1180 ఉద్యోగాల నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1180 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు మార్గం సుగమమైంది.
1180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లు సహా వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. కొత్త పోస్టులకు అగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్లు(ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

రెవెన్యూ విభాగం జూనియర్ అసిస్టెంట్లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ జారీ చేయనుంది. కాగా, ఈ నోటిఫికేషన్ ఆగస్టులో వెలువడే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను బర్తీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications