AP DSC 2024: డీఎస్సీ పరీక్షపై అభ్యర్ధుల కీలక డిమాండ్లు- సర్కార్ కరుణిస్తుందా?

ఏపీలో సుదీర్ఘ విరామం తర్వాత ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహించబోతోంది. అంతకు ముందే టెట్ పరీక్ష నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ రెండు పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను నిన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అయితే ప్రభుత్వం ఈసారి డీఎస్సీ నిర్వహణ కోసం ఇచ్చిన షెడ్యూల్ తో పాటు పలు అంశాల్లో అభ్యర్ధుల నుంచి కొత్త డిమాండ్లు మొదలయ్యాయి. వీటి విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగబోతోంది.

రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించి చాలా కాలమైంది. వైసీపీ ప్రభుత్వంలో ఇదే తొలి డీఎస్సీ. రాష్ట్రంలో తమకు అధికారం ఇస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చారు. దీంతో మిగతా ఉద్యోగాలు, సంక్షేమ పథకాల తరహాలోనే భారీ ఎత్తున పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన ఉంటుందని ఐదేళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో కేవలం 6100 పోస్టులకే పరీక్ష నిర్వహిస్తున్నారు.

AP DSC 2024: candidates demand an increase in posts and more time for preparation

జిల్లాల వారీగా చూస్తే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు ఈ పోస్టుల్ని విభజిస్తే సగటున 234 పోస్టులు మాత్రమే వస్తున్నాయి. కానీ పోటీ చూస్తే లక్షల్లో ఉండబోతోంది. దీంతో అభ్యర్ధులు జగన్ గతంలో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ ప్రకారం కనీసం 25 వేల పోస్టుల్ని ఈసారి భర్తీ చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. పలు జిల్లాల్లో ఇప్పుడు ఇదే డిమాండ్ తో అభ్యర్ధులు, విద్యార్ధి సంఘాలతో కలిసి నిరసనలకు దిగుతున్నారు. కానీ ప్రభుత్వం పోస్టుల్ని పెంచే పరిస్దితి లేదని చెప్పేస్తోంది.

మరోవైపు నిన్న విద్యామంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన ప్రకారం డీఎస్సీ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం పెట్టుకున్న గడువు 50రోజులు మాత్రమే. ఈ 50 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలతో పాటు దరఖాస్తుల స్వీకరణ, స్క్రీనింగ్, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి అన్నీ పూర్తయిపోతాయి. అయితే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ షెడ్యూల్ ను ఎంచుకుంది.

ఏపీలో ఎన్నికలు ఒకే విడతలో ఏప్రిల్ రెండో వారంలో ఉండే అవకాశం ఉంది. అందుకే డీఎస్సీ ఫలితాల వెల్లడికి ప్రభుత్వం ఏప్రిల్ 7 గడువుగా పెట్టుకుంది. కానీ అభ్యర్ధుల కోణంలో చూస్తే కనీసం రెండు నెలలు కూడా గడువివ్వకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+