AP DSC New Schedule: ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూల్ విడుదల-పరీక్షలు, ఇతర ముఖ్య తేదీలివే..!
ఏపీలో ప్రభుత్వం ఇవాళ డీఎస్సీ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం.. టెట్ పరీక్షా ఫలితాల తర్వాత తగినంత గడువు ఇవ్వకపోవడంతో అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు పాత షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం ఇవాళ కొత్త తేదీలతో షెడ్యూల్ విడుదల చేసింది.

ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ జరగబోతున్నాయి. ముందుగా సెకండరీ గ్రేట్ టీచర్స్ (ఎస్జీటీ) పరీక్షల్ని మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ 10 సెషన్లలో నిర్వహించబోతున్నారు. అలాగే టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టుల కోసం నిర్వహించే ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష ఏప్రిల్ 7న ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ పోస్టుల కోసం పరీక్షలను ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ నిర్వహించబోతున్నారు.
మార్చి 20 నుంచి అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాల్ని ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇవ్వనున్నారు. మార్చి 25 నుంచి డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఐఐటీ జేఈఈ, ఇతర పరీక్షల దృష్ట్యా ఏప్రిల్ నెలలో డీఎస్సీ పరీక్షలకు కొన్ని పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కొత్తగా అభ్యర్ధులు పరీక్షా కేంద్రాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ప్రభుత్వం https://apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications