Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP EAPCET 2024(EAMCET) : ఎన్నికల ఎఫెక్ట్- ఎంసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు...!

ఏపీలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) షెడ్యూల్ లో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన ఈఏపీసెట్ షెడ్యూల్ కూ, తాజాగా విడుదలైన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కు క్లాష్ అవుతున్న నేపథ్యంలో కొత్త తేదీల్ని ప్రకటించక తప్పని పరిస్దితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ నిర్వహిస్తున్న కాకినాడ జేఎన్టీయూ కొత్త తేదీల్ని ప్రకటించబోతోంది.

ఈ ఏడాది ఎంసెట్ (ఈఏపీసెట్) పరీక్షలను మే 13 నుంచి మే 19 వరకూ నిర్వహిస్తామని కాకినాడ జేఎన్టీయూ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మే 13న జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో మే 13న జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలను తప్పనిసరిగా వాయిదా వేయాల్సిన పరిస్దితి ఉంది. దీంతో మొత్తం షెడ్యూల్ లో మార్పులు చేస్తారా లేక ఆ ఒక్క పరీక్ష తేదీని మారుస్తారా అన్నది తేలాల్సి ఉంది.

AP EAPCET 2024 Schedule to be Changed due to elections new dates announcement soon

ఇప్పటికే జేఎన్టీయూ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం మే 13 నుంచి 16 వరకూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అలాగే వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 17 నుంచి 19 వరకూ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పుడు మే 13న ఎన్నికల పోలింగ్ ఉండటం, పోలింగ్ కోసం తీసుకున్న పరీక్షా కేంద్రాల్ని ఖాళీ చేసి తిరిగి అప్పగించేందుకు రెండు రోజులు పట్టే అవకాశం ఉండటంతో షెడ్యూల్ లో మార్పులు తప్పడం లేదు. దీంతో కొత్త తేదీల్ని త్వరలో విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు.

ఈఏపీసెట్ పరీక్ష తేదీలు, కొత్త షెడ్యూల్ కోసం అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ ను సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్ధులకు ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు [email protected]కు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. అలాగే 0884-2359599, 2342499 నంబర్లకు కూడా ఫోన్ చేయవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+