AP DSC 2024: ఈ పోస్టులకు పొరపాటున దరఖాస్తు చేశారా ? ఇవాళ సరిదిద్దుకునే ఛాన్స్..!

ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ఆధారంగా అభ్యర్ధులు వివిధ కేటగిరీల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో ఓ కేటగిరీ పోస్టుల విషయంలో మాత్రం అభ్యర్ధులు గందరగోళానికి గురయ్యారు. ఒక పోస్టుకు బదులు మరో పోస్టుకు దరఖాస్తు చేసేసుకున్నారు. విషయం తెలిశాక లబోదిబోమంటున్నారు. విషయం అధికారుల దృష్టికి రావడంతో దాన్ని సరిచేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)తో పాటు ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీని ప్రకటించింది. అయితే కొందరు అభ్యర్ధులు ఈ రెండు పోస్టుల దరఖాస్తుల విషయంలో గందరగోళానికి గురయ్యారు. పొరబాటున తాము అర్హులైన ఓ పోస్టుకు బదులు మరో పోస్టుకు దరఖాస్తు చేసేసుకున్నారు. సాధారణంగా అయితే నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం రూ.750 చెల్లించి తాము అర్హులైన మరో పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. తప్పుగా దరఖాస్తు చేసిన పోస్టుకు చెల్లించిన ఫీజు కూడా వెనక్కి ఇవ్వరు.

AP government allows candidates to edit DSC 2024 applications of this post today

కానీ పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు నేతృత్వంలోని బృందం విద్యాశాఖ కమిషనర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో ఇవాళ రెండు గంటల పాటు ఎడిట్ ఆప్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ ఇలా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు బదులుగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు దాన్ని సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రెండు గంటల్లోనే సదరు తప్పుగా దరఖాస్తు చేసిన అభ్యర్ధులు తమ ఆప్షన్ ను సరిచేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+