ఏపీ ప్రభుత్వ వైద్యరోగ్యశాఖలో ఉద్యోగాలు: 4775 ఉద్యోగాల కోసం వెంటనే అప్లై చేయండి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల విభాగంలో 4,775 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నియామకాలను అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టనున్నారు.
ఈ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7న ప్రారంభం అవుతుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 16వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. అంతేగాక, ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిజ్టర్ అయి ఉండాలి. కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.

వైద్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాల ప్రకారం.... జోన్-1 (విశాఖపట్నం)-974 ఖాళీలు, జోన్-2 (రాజమండ్రి)-1,446 ఖాళీలు, జోన్-3 (గుంటూరు)-967 ఖాళీలు, జోన్-4 (కడప)-1,368 ఖాళీలు ఉన్నాయి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు hmfw.ap.gov.in లేదా cfw.ap.nic.in వెబ్ సైట్లను సందర్శించవచ్చు.












Click it and Unblock the Notifications