AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..!
ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు (AP Inter Results 2026) విడుదలపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధుల ఉత్కంఠకు తెరదించుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ఫలితాల విడుదల తేదీ, సమయం, ఇతర వివరాల్నీ ఒకేసారి వెల్లడించారు.
ఎదురుచూపులు రేపటితో ముగుస్తాయి అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) 2026, 1వ మరియు 2వ సంవత్సరం విద్యార్థుల ఫలితాలు ఏప్రిల్ 15న ఉదయం 10:31 గంటల నుండి విడుదల కానున్నాయని ఆయన తెలిపారు. వెంటనే https://resultsbie.ap.gov.in లో మీ ఫలితాలను చూసుకోండి లేదా క్యూలలో నిలబడకుండా - వాట్సాప్ (9552300009) లో మన మిత్రకు "Hi" అని పంపి, క్షణాల్లో మీ ఫలితాన్ని పొందాలని సూచించారు. ప్రతి విద్యార్థికి ఆల్ ది బెస్ట్! ఇది మీ క్షణం. వెళ్లి రాణించాలన్నారు.

The wait ends tomorrow!
— Lokesh Nara (@naralokesh) April 14, 2026
Intermediate Public Examinations (IPE) 2026 results for 1st & 2nd year students will be out on April 15 from 10:31 AM onwards.
Check instantly at https://t.co/UDtk11c781 or skip the queues - just send a “Hi” to Mana Mitra on📱WhatsApp (9552300009) and…
ఈ ఏడాది ఏపీలో ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం పరీక్షలకు మొత్తం 10.57 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ లో 5.31 లక్షలకు పైగా విద్యార్ధులు హాజరయ్యారు. అలాగే 2వ సంవత్సరంలో 5.26 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వీరికి వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఫలితాలు విడుదల కాగానే ఇవి అందుబాటులో ఉంటాయి.
-
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
CBSE Class 10 Result 2026: ముందుగానే టెన్త్ రిజల్ట్స్? డిజీ లాకర్ హింట్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి?












Click it and Unblock the Notifications