AP Inter Results 2024: కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కాబోతున్నాయి. ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, పునఃపరిశీలన, డిజిటల్ రికార్డింగ్ ప్రక్రియలను పూర్తి చేసుకుని ఇవాళ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు పలు ప్రైవేటు వెబ్ సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచుతున్నారు.

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20 వరకూ నిర్వహించారు. ఇందులో ఫస్టియర్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కాగానే ఆన్ లైన్లో అప్ లోడ్ చేస్తారు. అనంతరం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/ లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

ap intermediate exams 2024 result release today- here is how to check

ఇవాళ ఇంటర్ ఫలితాలను ఫస్టియర్, సెకండియర్ కలిపి ఒకేసారి విడుదల చేస్తారు. ఫలితాలను అధికారికంగా విడుదల చేయగానే ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ ప్రథమ సంవత్సరమా లేక ద్వితీయ సంవత్సరమా అనేది ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేశాక హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత స్కోరు కార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+