మెగా డీఎస్సీ హాల్‌టికెట్స్ రిలీజ్.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ (AP DSC 2025) పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్‌ను ఉపయోగించి హాల్ టికెట్ పొందవచ్చు.
డీఎస్సీ 2025 పరీక్షల షెడ్యూల్..
పరీక్షలు ప్రారంభం: జూన్ 6, 2025
పరీక్షల ముగింపు: జూన్ 30, 2025

పరీక్షా విధానం..
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
పరీక్ష సమయం..
రెండు షిఫ్టులు (ఉదయం 9:30 AM - 12:00 PM, మధ్యాహ్నం 2:30 PM - 5:00 PM)
హాల్ టికెట్ల కోసం అవసరమైనవి..
రిజిస్ట్రేషన్ నంబర్ / అప్లికేషన్ ఐడి
పుట్టిన తేది / ఆధార్ నంబర్
ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో, రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేశారు.
ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటరు చేశారు.
పోస్టుల వివరాలు..
ఈ డీఎస్సీ ద్వారా పలు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), పీఈటీ, లాంగ్వేజ్ పండిట్, టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ సహా సంబంధిత పోస్టులు భర్తీ చేయనున్నారు.
ముఖ్య సూచనలు..
హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రానికి అనుమతి లేదు.
హాల్ టికెట్‌పై ఉన్న సూచనలను జాగ్రత్తగా చదవాలి.
గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్) కూడా తీసుకురావాలి.
పరీక్షకు కనీసం 1 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.
హాల్ టికెట్‌కి సంబంధించిన ఏవైనా సమస్యలు వచ్చినా, వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న మెయిల్ ఐడీకి ఈమెయిల్ చేయాలి.
మాక్ టెస్ట్ సదుపాయం..
ఇక ఇప్పటికే అభ్యర్థుల ప్రాక్టీస్ కోసం డీఎస్సీ మాక్ టెస్ట్‌లు కూడా విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ మాక్ టెస్ట్‌లను రాయవచ్చు. ఇది పరీక్షా విధానం, టైమ్ మేనేజ్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications