AP POLYCET Results : ఏపీ పాలిసెట్ 2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌చేసుకోండి..
పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ పాలిసెట్ 2024 ఫలితాలను నేడు (మే 8) సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి విడుదల చేశారు. గతనెల 27వ తేదిన ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,025 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,24,430 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకునేందుకు https://polycetap.nic.in లేదా https://polycetap.nic.in/apssprc.aspx ఈ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పాలిసెట్ ఎంట్రెన్స్ కోసం ఉచిత కోచింగ్‌ను కూడా సాంకేతి విద్యాశాఖ విద్యార్థులకు అందించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1వ తేది నుంచి 25వ తేదీ వరకు ఈ ఉచిత కోచింగ్ నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్స్, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లలో ఈ క్లాసులు జరిగాయి.

తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలలో సిద్దం చేసిన ఉచిత పాలిసెట్ కోచింగ్ మెటీరియల్‌ను కూడా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఏపీ పాలిసెట్ పరీక్ష ఏప్రిల్ 27వ తేదీన జరగగా, ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ ప్రాథమిక కీ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీపై అభ్యంతరాలను తెలిపేందుకు కూడా విద్యార్థులకు అవకాశం ఇచ్చారు. అనంతరం మే 6న తుది కీని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. నేడు (మే 8) పాలిసెట్ ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు కేవలం తమ హాల్‌టిక్కెట్ నెంబర్‌తో ఫలితాలను చెక్‌చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications