ap ssc hall ticket 2025: పదో తరగతి హాల్ టికెట్ల విడుదల-డౌన్లోడ్ ఇలా..!
ఏపీలో పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఈసారి హాల్ టికెట్లను విడుదల చేశారు. ఈ హాల్ టికెట్లు ఎక్కడెక్కడ డౌన్ లోడ్ కోసం అందుబాటులో ఉంటాయో వివరాలను కూడా వెల్లడించారు. విద్యామంత్రి నారా లోకేష్ స్వయంగా ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇందులో డియర్ ఎస్సెస్సీ స్టూడెంట్స్ అంటూ మొదలుపెట్టి వివరాలను వెల్లడించారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకూ నిర్వహించనున్నారు. వీటికి హాజరయ్యే విద్యార్ధుల కోసం హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ తో పాటు మన మిత్ర వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.inలో హాల్ టికెట్లను అప్ లోడ్ చేస్తున్నారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009ను సేవ్ చేసుకుని హాయ్ అని టైప్ చేస్తే విద్య సేవలు వస్తాయి. ఇందులో పదో తరగతి హాల్ టికెట్లను క్లిక్ చేస్తే వివరాలు వస్తాయి.

Dear SSC Students,
— Lokesh Nara (@naralokesh) March 3, 2025
Please note that your SSC Public Examinations, March 2025 Hall Tickets will be available for download from 02:00 PM on 03.03.2025. You can access them through:
1. Your school login on the official BSE AP website (https://t.co/WWf8D33on8)
2. Mana Mithra, the…
స్కూల్ లాగిన్ ద్వారా హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. వాట్సాప్ లో విద్యార్ధుల దరఖాస్తు సంఖ్య, విద్యార్థుల ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆల్ ది బెస్ట్, కీప్ సైనింగ్ అంటూ విద్యార్దులనుద్దేశించి మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. దీంతో విద్యార్ధులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. వీటిని ప్రింట్ తీసుకుని పరీక్షలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications