ఏపీలో టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల- మార్క్ లిస్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..!
ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఏపీ విద్యాశాఖ కమిషనర్ టెన్త్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు నేరుగా విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ https://results.bse.ap.gov.in/ లోకి వెళ్లి ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ తో పాటు పలు ఇతర ప్రైవేట్ వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏడాది ఏపీలో 6.23 లక్షల మంది విద్యార్దులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ విద్యాసంవత్సరం పూర్తి కాకముందే టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. పరీక్షలు రాసిన వారిలో మొత్తం 5.34 లక్షల మంది పాసయ్యారు. మొత్తం మీద 86.69 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 గానూ, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 గా ఉంది.
రాష్ట్రంలో ఈసారి 2300 స్కూళ్లు వందశాతం ఫలితాలు సాధించాయి. 17 స్కూళ్లు మాత్రమే జీరో శాతం ఫలితాలు సాధించాయి. 96.37 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్దానంలో నిలిచింది. 62.445 శాతంతో కర్నూలు జిల్లా చివరి స్ధానంలో ఉంది. ఏపీ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ స్కూళ్లు 98.43 శాతం ఫలితాలతో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications