Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP SSC hall tickets: పదో తరగతి హాల్ టికెట్ల విడుదల- ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!

ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఎదురైన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షల షెడ్యూల్, పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల రూపకల్పన ఇలా ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు హాల్ టికెట్లను ఆన్ లైన్ లోనూ విడుదల చేస్తోంది. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్లో ఇప్పటికే హాల్ టికెట్లను అప్ లోడ్ చేసిన అధికారులు.. ఇవాళ్టి నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

ఏపీలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకూ పదో తరగతి వార్షిక పరీక్షలు జరగబోతున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ https://bse.ap .gov.in/ లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే www.manabadi.co.in వెబ్ సైట్లోనూ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్ టికెట్లను ఆయా వెబ్ సైట్లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. స్కూల్ లాగిన్స్ తో పాటు విద్యార్ధులకు కూడా వీటిని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

AP SSC hall tickets will be available on official website bse ap gov in

పదో తరగతి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు విద్యార్ధులు అధికారిక వెబ్ సైట్ https://bse.ap .gov.in/లోకి వెళ్లి పదో తరగతి పరీక్షల లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం యూజర్ ఐడీగా స్కూల్ కోడ్ ను, పాస్ వర్డ్ గా స్కూల్ కు ఇచ్చిన కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్ట్రీమ్, జిల్లా, స్కూల్ పేరు, విద్యార్ధి పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్ టికెట్ ను
డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను తప్పనిసరిగా ప్రింట్ అవుట్ తీసుకుని ఉంచుకోవాలి. పరీక్షలకు వీటిని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+