AP TET-2024 hall tickets:ఏపీ టెట్ హాల్ టికెట్ల విడుదల-డౌన్ లోడ్ లింక్ ! బీఈడీ అభ్యర్ధుల ఫీజు రిటర్న్
ఏపీలో ఉపాధ్యాయ నియామకాల కోసం జారీ చేసిన డీఎస్సీ పరీక్షకు అర్హత సాధించేందుకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష హాల్ టికెట్లు ఇవాళ విడుదలయ్యాయి. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో వీటిని విడుదల చేసింది. అలాగే టెట్ పరీక్ష తేదీల వివరాలను కూడా ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్ధులు సదరు వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టెట్ పరీక్ష కు గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు కూడా మరో అప్ డేట్ ఇచ్చింది.
ఈ ఏడాది ఏపీ టెట్ పరీక్షకు 2.67 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరు తమ హాల్ టికెట్లను టెట్ అధికారిక వెబ్ సైట్ https://aptet.apchss.in// నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే వాటిని ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెట్ అధికారిక వెబ్ సైట్ లో పరీక్షల తేదీలు, పరీక్షా కేంద్రాలు, ఇతర వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. వీటి ప్రకారం. పరీక్షా తేదీ వివరాలు ఇలా ఉన్నాయి.

PAPER 1A : 27.02.2024 TO 01.03.2024,
PAPER 2A: 02.03.2024 to 04.03.2024 & 06.03.2024,
PAPER 1B : 05.03.2024 (FN),
PAPER 2B : 05.03.2024 (AN).
రాష్ట్ర వ్యాప్తంగా 120 పరీక్షా కేంద్రాల్లో ఈనెల 27 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్ధులు ఎంచుకున్న పరీక్షా కేంద్రాల్ని మాత్రమే వారికి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఎస్జీటీల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్ని కేటాయించారు. పరీక్షా కేంద్రాలపై ఎలాంటి వివరాలు కావాలన్నా విద్యాశాఖాధికారుల్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే అభ్యర్థుల సౌకర్యం కోసం టెట్, డీఎస్సీ పరీక్షలపై హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 8:00 నుండి సాయంత్రం 6:00 వరకూ పనిచేస్తుందన్నారు. హెల్ప్ డెస్క్ నంబర్లు 9505619127 , 9705655349 8121947387, 8125046997.
మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్ధులు అనర్హులని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఫీజు చెల్లించిన సదరు అభ్యర్ధులకు వారి ఆధార్ నంబర్ కు లింక్ అయిన ఖాతాల్లో ఆ మొత్తం రిటర్న్ చేస్తామని పాఠశాలవిద్యాశాఖ కమీషనర్ తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications