ఏపీ డీఈఈసెట్ 2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం..

ఇంట‌ర్ పూర్త‌యిన అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. డీఈఈసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా విభాగం 2024-25 విద్యా సంవత్సరానికి గాను డీఈఈసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ కోర్సు రెండు సంవ‌త్స‌రాలు ఉంటుంది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్‌) ప‌రీక్ష డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వ‌హిస్తారు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం డీఈఈసెట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. డీఈఈసెట్ ప‌రీక్ష‌లో సాధించిన ర్యాంకు ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు పొందే అవ‌కాశం ఉంటుంది. ఈ నోటిఫికేష‌న్ ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డీఈఈసెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష మే 24న నిర్వహిస్తారు.

డీఈఈసెట్ ప్ర‌వేశ పరీక్ష పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి :

కోర్సు : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్

విద్యార్హ‌త‌లు : డీఈఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు అప్ల‌య్ చేసుకోవాలంటే కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్న‌వారు అర్హులు.

APDEECET 2024 Notification Released Application Process Begins

వయ‌సు : కనిష్ఠంగా సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష రాసేవారికి గరిష్ఠ వయోపరిమితి లేదు.

కోర్సులో ఎంపిక చేయు విధానం : డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఈ కోర్సులో సీటు కేటాయిస్తారు.

కేటగిరీ సీట్లు : మ్యాథమెటిక్స్- 25%, ఫిజికల్ సైన్స్- 25%, బయోలాజికల్ సైన్స్- 25%, సోషల్ స్టడీస్- 25%.

ఈ ప‌రీక్ష‌కు అప్ల‌య్ చేసేందుకు దరఖాస్తు ఫీజు : అభ్య‌ర్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.

డీఈఈసెట్ పరీక్ష విధానం : ఈ ప‌రీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. డీఈఈసెట్ ప‌రీక్ష‌లో రెండు పార్ట్‌లు ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ 60 మార్కులు- 60 ప్రశ్నలు, పార్ట్-బి 40 మార్కులు- 40 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.

డీఈఈసెట్ ప‌రీక్ష ముఖ్య తేదీలు ఇలా ఉన్నాయి...

22.04.2024 - ఏపీ డీఈఈసెట్‌-2024 నోటిఫికేషన్ విడుదల

23.04.2024 నుంచి 08.05.2024 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు చేసుకోవ‌చ్చు.

24.04.2024 నుంచి 09.05.2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవ‌కాశం.

21.05.2024 - డీఈఈసెట్ ప‌రీక్ష హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తారు.

24.05.2024న‌ డీఈఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వ‌హిస్తారు.

30.05.2024న ప‌రీక్ష ఫలితాలు ప్ర‌క‌టిస్తారు.

06.06.2024 నుంచి 08.06.2024 వరకు మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఐచ్ఛికాల న‌మోదు చేసుకోవ‌చ్చు.

10.06.2024 సీట్లను కేటాయిస్తారు.

12.06.2024 నుంచి 15.06.2024 వరకు స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+