తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్.. రూ.40 వేలు జీతం..డోంట్ మిస్..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న యూనిట్లలో ఖాళీల భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏదైనా ఒక పోస్టుకు అప్లై చేసుకోవడానికి అర్హులు. పరీక్షలో ఎంపికైతే రూ.40,000 నుండి రూ.2,20,000 వరకు జీతం ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు మీకోసం..
మొత్తం పోస్టుల సంఖ్య: 49, మేనేజ్ మెంట్ ట్రైనీ(ఎలక్ట్రానిక్స్)- 15, మేనేజ్ మెంట్ ట్రైనీ(మెకానికల్)- 10, మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 11, మేనేజ్ మెంట్ ట్రైనీ(కంప్యూటర్ సైన్స్)- 02, మేనేజ్ మెంట్ ట్రైనీ (సైబర్ సెక్యూరిటీ)- 01,మేనేజ్ మెంట్ ట్రైనీ (కెమికల్)- 01, మేనేజ్ మెంట్ ట్రైనీ (సివిల్)- 02, మేనేజ్ మెంట్ ట్రైనీ(బిజినెస్ డెవలప్మెంట్)- 02, మేనేజ్ మెంట్ ట్రైనీ (పబ్లిక్ రిలేషన్స్)- 01, మేనేజ్ మెంట్ ట్రైనీ(ఫైనాన్స్)- 04, మేనేజ్ మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్)- 02, మేనేజ్ మెంట్ ట్రైనీ (అఫీషియల్ లాంగ్వేజ్)- 01, అసిస్టెంట్ మేనేజర్(లీగల్)- 01, సీనియర్ మేనేజర్ (సివిల్)- 01, డీజీఎం (సివిల్)- 01.

అప్లికేషన్ ప్రారంభం : 30/01/2025
అప్లికేషన్ చివరి తేదీ : 21/02/2025
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తులు చేయాలి. అధికారిక వెబ్ సైట్ https://bdl-india.in/ సందర్శించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్ స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి. దాంతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 21/02/2025 నాటికి 27 నుండి 50 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత అకడమిక్ మెరిట్, ఫీల్డ్ అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేస్తారు. 1:10 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా ప్రకటించి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.40,000 వేల నుండి రూ.2,20,000 ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.












Click it and Unblock the Notifications