APPSC Group 1 Hall Tickets: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్లు రెడీ- డౌన్ లోడ్ ఇలా.. !
గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ ) చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్ధులకు హాల్ టికెట్లను రేపటి నుంచి అందుబాటులోకి తెస్తోంది. అలాగే వీటిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో వివరాలను వెల్లడించింది. ఈ నెల 17న జరిగే ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షల కోసం 1.48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ 1 ను మార్చి 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించనున్నారు. అలాగే పేపర్ 2 ను అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 301 కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలి. అందులో హోం పేజ్ లోనే గ్రూప్ 1 హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా లింక్ ను అందుబాటులో ఉంచుతున్నారు. దీనిపై క్లిక్ చేస్తే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్ల లింక్ ఓపెన్ అవుతుంది. ఇందులో అభ్యర్ధులు తమ ఓటీపీఆర్ మరియు ఇతర వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింటవుట్ కూడా తీసుకోవాలి. ఇందులోనే పరీక్షా కేంద్రం, అభ్యర్ధులు పాటించాల్సిన మార్గదర్శకాలు, ఇతర వివరాలు ఉంటాయి.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications