Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

APPSC Group2: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ తేదీ ఖరారు- హాల్ టికెట్ల విడుదల-డౌన్లోడ్ ఇలా..!

ఏపీలో నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే గ్రూప్ 2 ప్రిలిమినరీ రాసి అర్హత సాధించిన అభ్యర్ధులకు ఈ నెల 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్ధులు హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇతర వివరాలను కూడా సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

దాదాపు ఏడాది క్రితం గ్రూప్ 2 ప్రిలిమరీ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అప్పటి నుంచీ మెయిన్స్ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఏపీపీఎస్సీలో కదలిక వచ్చింది. ఈ నెల 23 వీరికి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 23న పేపర్ 1 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ నిర్వహిస్తారు. అలాగే పేపర్ 2 పరీక్షను మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకూ నిర్వహిస్తారు.

appsc group 2 mains hall tickets released- here is how to download exam date

అలాగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను కూడా అభ్యర్ధులకు అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default లోకి వెళ్లాల్సి ఉంటుంది. వెబ్ సైట్ హోంపేజ్ ఓపెన్ అయ్యాక అందులో గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ పేరుతో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. ఈ లింక్ ను క్లిక్ చేస్తే
https://applications-psc.ap.gov.in/Download_HallTickets/ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఓటీపీఆర్ ఐడీ, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే అందులో హాల్ టికెట్లు కనిపిస్తాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింటవుట్ ను పరీక్షకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

మొత్తం 905 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో 4.83 లక్షల మంది ప్రిలిమ్స్ కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4.04 లక్షల మంది పరీక్ష రాశారు. ఇందులో 92250 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. ఇప్పుడు వీరంతా మెయిన్స్ పరీక్ష రాయబోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+