APPSC Group1 Prelims Key 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కీ విడుదల-త్వరలో ఫలితాలు..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ని ఇవాళ విడుదల చేశారు. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ కీని అందుబాటులో ఉంచారు. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్ధులు ఈ కీని పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కమిషన్ దృష్టికి తీసుకొచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత ఫలితాలు ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఆన్సర్ కీని కమిషన్ అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in లో అందుబాటులో ఉంచారు. అభ్యర్ధులు ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్సర్ కీని పరిశీలించవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఈ నెల 21 వరకూ అంటే రేపటి వరకూ స్వీకరిస్తారు. అభ్యంతరాలను కూడా ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లోనే స్వీకరిస్తారు. అనంతరం అభ్యంతరాలను పరిశీలించి మార్కులపై నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఫలితాల ప్రకటన ఉంటుంది.

గత నెల 25న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం 1.48 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వీరిలో 1.26 లక్షల మందికి హాల్ టికెట్లు లభించాయి. వీరిలో 91 వేల మందే పరీక్ష రాశారు. అంటే 72.55 శాతం మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉన్న 301 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ప్రిలిమ్స్ ఆన్సర్ కీ విడుదలైంది. రేపటి వరకూ అభ్యంతరాలు స్వీకరించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం మెయిన్స్ పరీక్షలు ఉంటాయి.












Click it and Unblock the Notifications