రూ.1,47,000 జీతంతో ఉద్యోగాలు.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ !!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిరుద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ ప్రకటించింది. ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా డ్రాట్స్‌మెన్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, హార్టికల్చర్‌ ఆఫీసర్లు, జూనియర్‌ లెక్చరర్లు (లైబ్రరీ సైన్స్‌), హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ల వంటి కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం పోస్టులు..

21

ఖాళీలు..

డ్రాట్స్‌మెన్‌ గ్రేడ్‌-2 (టెక్నికల్‌ అసిస్టెంట్‌): 13 పోస్టులు

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు: 3 పోస్టులు

హార్టికల్చర్‌ ఆఫీసర్లు: 2 పోస్టులు

జూనియర్‌ లెక్చరర్‌ (లైబ్రరీ సైన్స్‌): 2 పోస్టులు

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌: 1 పోస్టు

appsc-notification-for-25-jobs-in-various-departments

అర్హతలు..

డ్రాట్స్‌మెన్‌ పోస్టులకు ఐటీఐ, సంబంధిత టెక్నికల్‌ కోర్సులో అర్హత కలిగి ఉండాలి.

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌/బీఈ డిగ్రీ తప్పనిసరి.

హార్టికల్చర్‌ ఆఫీసర్లకు వ్యవసాయ-ఉద్యాన శాస్త్రంలో డిగ్రీ అవసరం.

జూనియర్‌ లెక్చరర్‌ (లైబ్రరీ సైన్స్‌) పోస్టులకు లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్‌ లేదా సంబంధిత అర్హత ఉండాలి.

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు బీఈడ్‌తో పాటు గ్రాడ్యుయేషన్‌ అవసరం.

వయోపరిమితి..

అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వం నిర్ణయించిన నియమాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో పరిమితిలో రాయితీలు లభిస్తాయి.

దరఖాస్తు ప్రక్రియ..

అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 18, 2025 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్‌ 8, 2025గా నిర్ణయించారు.

దరఖాస్తు ఫీజు..

జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.120 చెల్లించాలి.

ఎంపిక విధానం..

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాత పరీక్ష ఆధారంగానే జరుగుతుంది. అవసరమైతే ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ కూడా నిర్వహిస్తారు. పరీక్షా తేదీలు, హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ వివరాలను త్వరలోనే APPSC అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటించనున్నారు.

జీతభత్యాలు..

ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నియమావళి ప్రకారం ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది:

డ్రాట్స్‌మెన్‌ పోస్టులు: రూ.34,580 - రూ.1,07,210

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు: రూ.57,100 - రూ.1,47,760

హార్టికల్చర్‌ ఆఫీసర్లు: రూ.54,060 - రూ.1,40,540

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌: రూ.37,640 - రూ.1,15,500

జూనియర్‌ లెక్చరర్‌ (లైబ్రరీ సైన్స్‌): రూ.57,100 - రూ.1,47,760

ముఖ్య సూచనలు..

అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.

దరఖాస్తు సమయంలో అర్హత సర్టిఫికెట్లు, కేటగిరీ సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం స్కాన్‌ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి.

తప్పు సమాచారం ఇచ్చిన అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+