నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ తీపికబురు.. 691 పోస్టులు DON'T MISS !

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఈ మేరకు పలు పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అందులో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం 691 ఖాళీలు అందుబాటులో ఉండగా.. అందులో 256 పోస్టులు FBOకి, 435 పోస్టులు ABOకి ఉన్నాయి. అలానే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోటా కింద కొంతమంది అభ్యర్థులను ప్రత్యేకంగా ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

appsc-notification-for-691-jobs-from-forest-department

దరఖాస్తు తేదీలు..

ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2025 జూలై 16 నుంచి ఆగస్టు 5, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు చేసే ముందు OTR (One Time Registration) తప్పనిసరిగా పూర్తి చేయాలి.

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మహిళా, పురుష అభ్యర్థులిద్దరూ పోటీకి అర్హులే. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి అదనంగా బోనస్ మార్కులు లభిస్తాయి.

శారీరక ప్రమాణాలు..

పురుషులు కనీసం 163 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.

మహిళలు కనీసం 150 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.

నడక పరీక్షలో పురుషులు 25 కిలోమీటర్లను 4 గంటల్లో, మహిళలు 16 కిలోమీటర్లను 4 గంటల్లో పూర్తి చేయాలి.

మెడికల్ టెస్ట్‌లోనూ వారు అర్హత సాధించాలి.

వయో పరిమితి..

2025 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం..

ముందుగా APPSC వెబ్‌సైట్‌లో OTPR చేయాలి.

ఆ తర్వాత FBO/ABO నోటిఫికేషన్‌కు అప్లై చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.

వివరాలు తప్పులేకుండా, స్పష్టంగా నమోదు చేయాలి.

దరఖాస్తు ఫీజు..

జనరల్ అభ్యర్థులు: రూ.250 ప్రాసెసింగ్ ఫీజు + రూ.80 ఎగ్జామినేషన్ ఫీజు కలిపి మొత్తం రూ. 330 అవుతుంది.

SC/ST/BC/Ex-Servicemen/Unemployed Youth: రూ.250 మాత్రమే (ఎగ్జామినేషన్ ఫీజు మినహాయింపు)

ఎంపిక విధానం..

ఎంపిక ఈ నాలుగు దశల ప్రకారం జరుగుతుంది:

స్క్రీనింగ్ టెస్ట్ (Objective Type - OMR బేస్డ్)

మెయిన్స్ పరీక్ష

నడక పరీక్ష + మెడికల్ టెస్ట్

కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)

వేతనం..

FBO పోస్టులకు: రూ.21,230 - రూ.63,010

ABO పోస్టులకు: రూ.16,400 - రూ.49,870

అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి.

ముఖ్య సూచనలు..

ఒక్క అభ్యర్థి ఒకే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి.

శారీరక ప్రమాణాలన్నీ తప్పనిసరిగా సరిపోవాలి.

ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఎడిట్ చేయడం సాధ్యం కాదు.

హాల్ టికెట్ విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+