ఆయూష్‌లో ఉద్యోగాలు: రూ. 70వేల వరకు జీతం, అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేయండి

న్యూఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ (సీపీఎంూ) కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనుంది. సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్, డేటా అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తుల్ని కేవలం పోస్టులో పంపాల్సి ఉంటుంది. ఈ జాబ్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు:

 Ayush Recruitment 2021: 7 posts with good salary

Recommended Video

    interview with bjp state president bandi sanjay on huzurabad by poll trends

    సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్): 1
    విద్యార్హతలు: ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జీతం: రూ.75,000

    జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్): 2
    విద్యార్హతలు: ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతిలో గ్రాడ్యుయేషన్ జీతం: రూ.50,000

    ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటీవ్): 2
    విద్యార్హతలు: ఎంబీఏ (హెచ్ఆర్, ఫారిన్ ట్రేడ్, టూరిజం, ఇంటర్నేషనల్ బిజినెస్) జీతం: రూ.50,000

    డేటా అసిస్టెంట్: 1
    విద్యార్హతలు: కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ జీతం: రూ.20,000

    మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 1
    విద్యార్హతలు: 10+2 లేదా తత్సమా అర్హత
    జీతం: రూ.16,000

    ఆయూష్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు:

    దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 10, 2021, సాయంత్రం 5.30 గంటలు
    కాంట్రాక్ట్ గడువు: 2022 మార్చి 31 వరకు
    విద్యార్హతలు: సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.
    అనుభవం: రాష్ట్ర ప్రభుత్వాలు, రీసెర్చ్ కౌన్సిల్, ప్రభుత్వరంగ సంస్థల్లో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
    వయో పరిమితి: 50 ఏళ్ల లోపు
    ఎంపిక విధానం- రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ

    దరఖాస్తు విధానం:

    మొదట అభ్యర్థులు ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి.

    ఆ తర్వాత, అభ్యర్థి తన వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

    దరఖాస్తు ఫామ్‌కు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

    పూర్తి చేసిన దరఖాస్తును నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

    దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
    Assistant Advisor (SK),
    Champion Services Sector Scheme,
    Room No. 8, AYUSH Bhawan,
    B Block, GPO Complex,
    INA, New Delhi - 110023.

    దరఖాస్తు వివరాల కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
    (https://cdn.ayush.gov.in/wp-content/uploads/2021/10/adv-for-web.pdf)

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+