నిరుద్యోగులకు శుభవార్త -బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్‌ : 376 పోస్టుల భర్తీకి నిర్ణయం..!!

బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది. రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం 376 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు 376 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ 19 నవంబర్ 2021 నుంచి ప్రారంభమైంది.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 9 డిసెంబర్ 2021 చివరి తేదీగా ప్రకటించారు. అభ్యర్ధులు దరఖాస్తు కోసం bankofbaroda.in వెబ్ సైట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఈ 376 పోస్టుల్లో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ కోసం 326 సీట్లు, వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ కోసం 50 సీట్లు కేటాయించారు. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 92 సీట్లను కేటాయించారు. 101 సీట్లు ఓబీసీకి, 47 సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వారికి అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, 44 ఎస్సీ కేటగిరీకి, 42 ఎస్టీ కేటగిరీకి కేటాయించారు.

Bank Of Baroda issued notification 2021 for recruitment of relation ship manager posts

ఖాళీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు. bankofbaroda.in వెబ్ సైట్ లో జాబ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన E-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ ఎంపికకు వెళ్లాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆ వివరాలు పూర్తి చేసిన తరువాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి. జనరల్, OBC, ఆర్థికంగా బలహీన (EWS) కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.600 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఇది కాకుండా sc-st కేటగిరీ అభ్యర్థులు రూ.100, PH కేటగిరీ అభ్యర్థులు రూ.100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుమును డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 9 డిసెంబర్ 2021. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేస్తే సరిపోతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+