BPSC Recruitment: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయండి
న్యూఢిల్లీ:బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (బీపీఎస్సీ) 61 అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తోంది. ఆరోగ్య శాఖ బీహార్ పరిధిలోని రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, ఆస్పత్రులలో సూపర్ స్పెషాలిటీ
విభాగం కింద స్థానాలు నోటిఫై చేశారు.
ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు ప్రక్రియ జనవరి 20, 2023న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 17, 2023.
నోటిఫికేషన్ ప్రకారం, 61 ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో 36 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 25 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications