CA పరీక్షల ఫలితాలు రిలీజ్.. టాపర్స్ వీళ్లే ???
CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ మరియు ఫైనల్ పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ 2025లో ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్‌స్టిట్యూట్ (ICAI) ఈ పరీక్షలను నిర్వహించింది. కాగా ICAI ఈ రిజల్ట్స్ ని అధికారికంగా ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ icai.nic.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా 458 కేంద్రాలలో సెప్టెంబర్ 12 నుండి 26 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈసారి మొత్తం 81,852 మంది అభ్యర్థులు ఫైనల్ పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్ 1లో 51,955 మంది హాజరు కాగా.. 12,811 మంది (24.66%) ఉత్తీర్ణులయ్యారు. గ్రూప్ 2లో 32,273 మంది హాజరవ్వగా.. 8,151 మంది (25.26%) విజయం సాధించారు. రెండు గ్రూపులకు కలిపి 16,800 మంది హాజరైతే.. 2,727 మంది (16.23%) ఉత్తీర్ణత సాధించారు.

ఫైనల్ పరీక్షల టాపర్లు..
ఫైనల్ పరీక్షల్లో ముకుంద్ అగివాల్ 500 మార్కులతో (83.33%) అగ్రస్థానంలో నిలిచారు. తేజస్ ముండాడా 492 మార్కులతో (82%) రెండో స్థానంలో.. బాకుల్ గుప్తా 489 మార్కులతో (81.50%) మూడో స్థానంలో నిలిచారు.
CA ఇంటర్మీడియట్ ఫలితాలు 2025:
అలానే ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 1,59,779 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్ 1లో 9.43%, గ్రూప్ 2లో 27.14%, రెండు గ్రూపులకు కలిపి 10.06% ఉత్తీర్ణత నమోదైంది.
ఇంటర్మీడియట్ టాపర్లు:
నేహా ఖుర్వానీ 505/600 (84.17%) మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. కృతి శర్మ 503/600 (83.83%) మార్కులతో రెండో స్థానంలో, అక్షత్ బిరేంద్ర నౌటియాల్ 500/600 (83.33%) మార్కులతో మూడో స్థానంలో ఉన్నారు.
CA ఫౌండేషన్ ఫలితాలు 2025..
ఫౌండేషన్ పరీక్షలకు మొత్తం 98,827 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 14,609 మంది ఉత్తీర్ణులయ్యారు, మొత్తం పాస్ పర్సెంటేజ్ 14.78%గా నమోదైంది.
ఫౌండేషన్ టాపర్లు:
చెన్నైకి చెందిన ఎల్. రాజలక్ష్మి 360 మార్కులతో (90%) మొదటి స్థానంలో నిలిచారు. సూరత్‌కు చెందిన ప్రేమ్ అగర్వాల్ 354 మార్కులతో (88.50%) రెండో స్థానంలో, ముంబైకి చెందిన నీల్ రాజేష్ షా 353 మార్కులతో (88.25%) మూడో స్థానంలో నిలిచారు.
ఇక 70% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను డిస్టింక్షన్‌లో పాసైనట్లుగా పరిగణిస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రూపులలో ఫెయిల్ అయిన విద్యార్థులు తదుపరి సెషన్‌లో మళ్లీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ఫలితాలు ఎలా చెక్ చేయాలంటే..?
- అభ్యర్థులు icai.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- "CA September 2025 Result" లింక్‌పై క్లిక్ చేయాలి.
- తమ కోర్సు (Foundation/Inter/Final) ఎంపిక చేసుకోవాలి.
- రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పిన్ నమోదు చేసి, "Submit" బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.
- భవిష్యత్తు అవసరాల నిమిత్తం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications